ఆరోగ్య సేతులో మరో కొత్త ఫీచర్‌

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా సోకకుండా జాగ్రత్త పడేందుకు సాయం చేసే కోవిడ్‌ ట్రేసింగ్‌ యాప్‌ ‘ఆరోగ్య సేతు’లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టింది. కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో వ్యాపార సంస్థల కార్యకలాపాలు సులభతరం చేసేలా ‘‘ఓపెన్‌ ఏపీఐ సర్వీస్‌’’ను తీసుకువచ్చింది. దీని ద్వారా వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, ఈ యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలు కల్పించింది. అయితే ఇందుకు సదరు యూజర్ల అంగీకారం తప్పనిసరి అని, దీని ద్వారా ఆరోగ్య సేతు యాప్‌ యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేసింది



అదే విధంగా ఇందులో కేవలం ఆరోగ్య సేతు స్టేటస్‌, యూజర్‌ పేరు తప్ప మరే ఇతర వివరాలు ఉండవని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ , ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రాణాంతక కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 30 వేల పాజిటివ్‌ కేసులను ట్రేస్‌ చేసినట్లు సమాచారం. దీంతో కరోనా బాధితులను గుర్తించడంతో పాటు వారిని అప్రమత్తం చేసి తగిన చికిత్స అందించడం ఆరోగ్య కార్యకర్తలకు తేలికైంది. ఇక ఆరోగ్య సేతు యాప్‌నకు సుమారు 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • త్వరలో ప్రజా రవాణా ప్రారంభం: గడ్కరీన్యూఢిల్లీ, మే 6: దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఆంక్షలు పాటిస్తూనే ప్ర… ...
  • సీబీఎస్‌ఈ సిలబస్‌ కుదింపుసీబీఎస్‌ఈ సిలబస్‌ కుదింపు!  కరోనా నేపథ్యంలో నిపుణుల కమిటీ అధ్యయనం అ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు : వచ్చే విద్యా సంవత్సరానికి … ...
  • Nadu Nedu works VC BY CM- Talking pointsTalking points for the VC dated 07-05-2020: 1. Honorable CM during the VC on 5th April has instructed to complete all the Nadu Nedu works u… ...
  • *Jagananna Gorumudda MDM App update*Jagananna Gorumudda MDM App అప్డేట్ చేయబడినది*▪️Version:3.05▪️Updated On: 6.5.20DownloadBelowLinkCLICK HERE TO DOWNLOAD APPCVPRASAD… ...
  • ఎస్బీఐ అత్యవసర లోన్లు45 నిమిషాల్లోనే రూ.5 లక్షల రుణంప్రారంభ వడ్డీరేటు 10.5 శాతమే6 నెలల తర్వాతే ఈఎంఐలు మొదలున్యూఢిల్లీ, మే 6: ప్రభు త్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస… ...

0 Response to "ఆరోగ్య సేతులో మరో కొత్త ఫీచర్‌"

Post a Comment