ఎస్బీఐ అత్యవసర లోన్లు


  • 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల రుణం
  • ప్రారంభ వడ్డీరేటు 10.5 శాతమే
  • 6 నెలల తర్వాతే ఈఎంఐలు మొదలు

న్యూఢిల్లీ, మే 6: ప్రభు త్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ.. అత్యవసర రుణాలను అం దుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభావితమైన ప్రజల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.5 లక్షల వరకు రుణాలిస్తామంటూ ముందుకొచ్చింది. కేవలం 45 నిమిషాల్లోనే ఈ రుణాలను పొందగలగడం గమనార్హం. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే దీన్ని ఈ నెల 17దాకా కేంద్ర ప్రభుత్వం పొడిగించిన సంగతీ విదితమే. లాక్‌డౌన్‌తో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు మూతబడి వివిధ వర్గాలు ఆదాయం కోల్పోగా..



వారందరికీ ఊరటనిస్తూ ఎస్బీఐ ఈ ఎమర్జన్సీ లోన్‌ స్కీంను తమ కస్టమర్లకు కల్పించింది. ముఖ్యంగా ఈ రుణాలను తీసుకున్నవారికి ఈఎంఐలు 6 నెలల తర్వాతే మొదలు కానున్నాయి. నగదు కొరతను ఎదుర్కొంటున్నవారికి ఇది నిజంగా ఎంతో ఉపశమనం కలిగించే నిర్ణయమే. ఇక వడ్డీరేటు కూడా ఇతర వ్యక్తిగత రుణాలతో పోల్చితే చాలా తక్కువ. 10.5 శాతం నుంచే ప్రారంభం అవుతుంది.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు

ఈ అత్యవసర రుణాల కోసం ఎవరూ బ్యాంకులదాకా వెళ్లనవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ యోనో యాప్‌ ద్వారా దీన్ని పూర్తి చేయవచ్చు. ఎప్పుడైనాసరే (24X7) మీరు ఆన్‌లైన్‌లో మీ అప్లికేషన్లను దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం onlinesbi.com లేదా sbi.co.inలోకి లాగిన్‌ కావచ్చు. ఇదిలావుంటే ఈ రుణాల కోసం అర్హతను తెలుసుకోవడానికి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయవచ్చు. ఎస్‌ఎంఎస్‌ విధానం విషయానికొస్తే.. PAPL అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీ ఎస్బీఐ ఖాతా నెంబర్‌లోని చివరి 4 అంకెలను టైప్‌ చేసి 567676కు పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అర్హత వివరాలను ఎస్బీఐ మీకు తెలియజేస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అత్యవసర రుణాన్ని తీసుకునే అర్హత మీకుందన్న సమాచారం ఎస్బీఐ నుంచి వస్తేనే ఈ రుణం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా YONO SBI యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత 'ప్రీ-అప్రూవ్డ్‌ లోన్‌' పై క్లిక్‌ చేయాలి. ఎంత రుణం కావాలి, రుణ వ్యవధి ఎంత అన్నది ఎంచుకోవాలి. అనంతరం మీ బ్యాం క్‌ ఖాతాకు అనుసంధానంగా ఉన్న మొబైల్‌ నెంబర్‌కు ఎస్బీఐ నుంచి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని సమర్పించిన వెంటనే మీ సేవింగ్స్‌ ఖాతాలోకి సదరు రుణ మొత్తం జమ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ 45 నిమిషాల్లోనే ముగుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఎస్బీఐ అత్యవసర రుణ పథకాన్ని వినియోగించేసుకోండి. అత్యవసర రుణాలేగాక వేతన జీవుల కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత రుణాలనూ ఎస్బీఐ అందిస్తున్నది. ఇందులో నెలసరి నికర ఆదాయం కంటే 24 రెట్లు అధికంగా రుణ మొత్తాన్ని పొందవచ్చు. రుణ కాలపరిమితి రెండేండ్లు. వడ్డీ రేటు 11- 14 శాతం వరకు ఉంటుంది. ఉద్యోగ అనుభవం కనీసం ఏడాది ఉండాలి. 21 ఏండ్ల నుంచి 58 ఏండ్ల వయస్సువారే అర్హులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎస్బీఐ అత్యవసర లోన్లు"

Post a Comment