పింఛనుకు సంయుక్త ఖాతా తప్పనిసరి కాదు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌


ఈనాడు, దిల్లీ: జీవిత భాగస్వామి పింఛను (స్పౌస్‌ పెన్షన్‌)కి సంయుక్త ఖాతా తప్పనిసరి కాదని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. 


ప్రధాని మోదీ అన్ని వర్గాల జీవనాన్ని సులభతరం చేయాలని సంకల్పించారని, అందులో భాగంగానే సంయుక్త ఖాతా తప్పనిసరి కాదన్న నిబంధన తెచ్చారని పేర్కొన్నారు. 



వీలు కాని పరిస్థితుల్లో వారు తమ జీవిత భాగస్వాములతో సంయుక్త ఖాతా తెరవడం సాధ్యం కాదని హెడ్‌ ఆఫీస్‌ అధికారులు సంతృప్తి చెందితే ఈ సంయుక్త ఖాతా నిబంధనను సడలించవచ్చని తెలిపారు. ఇప్పటికే మనుగడలో ఉన్న జాయింట్‌ అకౌంట్‌లో కుటుంబ పింఛను క్రెడిట్‌ చేయాలని పింఛనుదారు కోరితే అందులోనే జమ చేయాలని కేంద్రం ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసిందని.. 



కొత్త జాయింట్‌ అకౌంట్‌ తెరవాలని వారిపై ఒత్తిడి చేయొద్దని నిర్దేశించిందని కేంద్రమంత్రి చెప్పారు. అయితే పింఛనుదారులు జీవితభాగస్వామితో కలిసి సంయుక్త ఖాతా తెరవడం వాంఛనీయమని, ఎవరి పేరుతో ఆథరైజేషన్‌ ఇచ్చారో వారితో కలిసి కుటుంబ పింఛను కోసం ఖాతా తెరవడం మంచిదని సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "పింఛనుకు సంయుక్త ఖాతా తప్పనిసరి కాదు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌"

Post a Comment