EHS ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకు గమనిక
*Dr. YSR Aarogyasri Health Care Trust*
*(Govt. of Andhra Pradesh)*
*పత్రికా ప్రకటన*
*EHS ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకు గమనిక*
డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు QR కోడ్ తో కూడిన EHS స్మార్ట్ హెల్త్ కార్డ్ ని జారీ చేయడం జరుగుతున్నది. QR కోడ్ కలిగిన EHS స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ కొరకు మీ వివరాలను EHS పోర్టల్ లాగిన్ ద్వారా సరిచూసుకొని మార్పులు ఉన్నయెడల ఏడు రోజులలో అప్డేట్ చెయ్యండి. ఇందుకొరకు మీరు EHS పోర్టల్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లతో లాగిన్ అయ్యాక, డౌన్ లోడ్ హెల్త్ కార్డ్స్ మీద క్లిక్ చేసిన యెడల మీకు ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు మీ వివరాలను అప్డేట్ చేయగలరు.
ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించి మీ లాగిన్ సరిచూసుకొని అందులో మీ పేరు, జెండర్, చిరునామా, ఫోటో, ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ సరిగా ఉన్నాయో లేదో గమనించి అక్కడ ఏదైనా తప్పులు ఉన్నచో సరిదిద్దుకోనుటకు ఏడు రోజులు గడువు ఇవ్వబడినది. మీరు అప్డేట్ చెయ్యని యెడల ఉద్యోగస్తుల మరియు పెన్షనర్ల దరఖాస్తులో ఉన్న వివరాలు సరైనవే అని భావించి స్మార్ట్ హెల్త్ కార్డులో ఆ వివరాలు ప్రింట్ చెయ్యడం జరుగుతుంది.
ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఈ అవకాశాన్ని గమనించి మీ లాగిన్ ని సరిచేసుకొని డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కి సహకరించగలరు అని డాII ఏ. మల్లికార్జున, IAS, ముఖ్య కార్య నిర్వహణ అధికారి, డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వారు కోరడమైనది.
ఏదైనా సందేహాల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 104 కి మరియు 8333817469, 8333817406, 8333817414 లకు ఫోన్ చెయ్యగలరు, అలాగే ap_ehf@ysraarogyasri.ap.gov.in, ap_c439@ysraarogyasri.ap.gov.in కి మెయిల్ చెయ్యగలరు.
ఇట్లు:
- Chief Executive Officer
Dr.YSR Aarogyasri Health Care Trust, Guntur.
EHS employees edit details gives which news paper.please send
ReplyDeleteEHS employees edit details gives which news paper.please send
ReplyDelete