ఉపాధ్యాయ బదిలీలు
*🌸 ఉపాధ్యాయ బదిలీలు*
★ ఉపాధ్యాయుల బదిలీల కసరత్తు మొదలై 20 రోజుల పూర్తవుతున్న నేపథ్యంలో మధ్యంతర దశకు చేరింది.
★ బదిలీల షెడ్యూల్ ప్రస్తుతం కొంత వేగం పుంజుకుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది.
★ జిల్లావ్యాప్తంగా 11,543 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా బదిలీ కావాల్సినవారు 1165 మంది, రిక్వెస్ట్ బదిలీలకు 3406 మంది దరఖాస్తు చేసుకొన్నారు.
*క్షుణ్ణంగా పరిశీలన*
★ గతంలో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారికి జిల్లా యూనిట్‌గా మాత్రమే కనిపించేవి. ప్రస్తుతం విద్యాశాఖ మాత్రం సీఎస్‌ఈ వెబ్‌సైటులో ప్రత్యేక ఐచ్చికాన్ని పొందుపరిచి,దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది.
★ గతంలో ప్రధానోపాధ్యాయులు, ఎమ్యీవోల పరిశీలనే అంతిమంగా ఉండేది. ఇప్పుడు జిల్లా విద్యాశాఖ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
★ అవగాహన లేక పాయింట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా, అర్హత లేని పాయింట్లతో దరఖాస్తు చేసుకున్నా వాటిని తిరిగి వెనక్కి పంపడమే కాక అందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.
★ ఇక పాయింట్ల ఆధారంగా జాబితాలు వెల్లడించటమే తరువాయి అని అధికారులు చెబుతున్నారు.
★ 2015లో ఎదురైన చేదు అనుభవాలతో వెబ్ కౌన్సెలింగ్‌ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎస్జీటీలు దీనిపట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు.
0 Response to "ఉపాధ్యాయ బదిలీలు"
Post a Comment