ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?
ముందుగాగా ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 14కు లాక్‌డౌన్ ముగుస్తుందా? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మనకంటే ముందే స్టే ఎట్ హోమ్‌ను ప్రకటించిన దేశాలు ఇంకా లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. అక్కడ కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ తప్పడం లేదు. ఇక మన దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,072కు చేరింది. మరణాలు కూడా 77కు చేరింది. వేలాది మంది ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. రోజుకు వందల మందికి కరోనా పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఇంకా కొనసాగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతోంది.
అయితే లాక్‌డౌన్‌ను కొనసాగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు అధికారులు
మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ తర్వాత కూడా కొన్ని షరతులు విధించే అవకాశం ఉందని కొందరి మాట. షాపింగ్ మాల్స్, థియేటర్స్ లాంటి ప్రదేశాల్లో జనాలు ఎక్కువగా గుమిగూడతారు. అందువల్ల కరోనాను అరికట్టడం కష్టమవుతుంది. దాని వల్ల ఆయా రాష్ట్రాలలోని పరిస్థితులు బట్టి ఆంక్షలు ఉండేలా ప్రభుత్వాలు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ తర్వాత ఆంక్షలు ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి..
1. రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులపై ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అటు ముఖ్యమైన సర్వీసులు మాత్రం అనుమతిస్తారని అంటున్నారు. అటు జనరల్ బోగీలను కూడా ప్రస్తుతం క్లోజ్ చేసే పరిస్థితి ఉంది.
2. లాక్ డౌన్ తర్వాత బస్సు సర్వీసులను కూడా దశలవారీగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
3. సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులతో పాటు దుకాణ సముదాయాలపై ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. అయితే షాపింగ్ మాల్స్, వాణిజ్య దుకాణాలను మాత్రం నిర్దిష్ట సమయం వరకే తెరిచే ఉండేలా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.
4. లాక్ డౌన్ తర్వాత దేశీయ విమానాలు ప్రారంభించినా.. అంతర్జాతీయ సర్వీసులపై మాత్రం ఆంక్షలు ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
5. 10 సంవత్సరాలలోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడిన వయస్సు వారిని బయట తిరగనీయకుండా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
6. అటు థియేటర్లు, బార్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చే వాణిజ్య సదుపాయాలపై అంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం
0 Response to "ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?"
Post a Comment