కరోనాపై వైద్యశాఖ తాజా హెచ్చరికలు ఇవే

అమరావతి: 60 ఏళ్ల పైబడిన‌వారు, పదేళ్ల లోపు పిల్లలు బయటకు రావద్దని వైద్యశాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి హెచ్చరించారు. అవసరమైతే నిత్యావసర వస్తువులను ఇంటికే సరఫరా చేస్తామని వెల్లడించారు. విదేశాల నుంచి 13,308 మంది‌ రాష్ట్రానికి వచ్చినట్లు తెలుస్తుందన్నారు. 12,421 మందిని గుర్తించి అన్ని రకాల‌ వైద్య పరీక్షలు చేసినట్లు వివరించారు. మరో రెండు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. రేపు రాత్రి నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విదేశాల్లో ఉన్న ఏపీ వాసులను స్వదేశానికి 


తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. వైజాగ్ విమ్స్‌లో 500 బెడ్లతో క్వారంటైన్ ఏర్పాటు చేసినట్లు వైద్యశాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "కరోనాపై వైద్యశాఖ తాజా హెచ్చరికలు ఇవే"

Post a Comment