1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఎయిడెడ్‌ టీచర్లు?

*📚✍1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఎయిడెడ్‌ టీచర్లు?✍📚*

*♦జిల్లాలో 502 మంది అంగీకారం*

*🌻ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 24:* ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు సుముఖత తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది నూతన స్థానాల్లో విధులు నిర్వర్తించేలా అక్టోబరు 1న సర్దుబాటు చేయనున్నట్టు తెలిసింది. తొలుత వీరందరినీ సమీప ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేసి, ఆ తదుపరి ప్రభుత్వ పాఠశాలల్లో క్లియర్‌ వెకెన్సీల ఆధారంగా టీచర్ల నుంచి ఐచ్ఛికాలను(ఆప్షన్లు) స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ చేయనున్నారు. దీనికి సంబంధించి సోమ, మంగళవారాల్లో మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 280 ప్రాథమిక, ప్రాఽథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఎయిడెడ్‌ రంగంలో ఉండగా, వీటిలో 592 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి ఎయిడెడ్‌ సిబ్బందిని విలీనం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 248 పాఠశాలల నుంచి 502 మంది తమ అంగీకార లేఖలను విద్యాశాఖకు అందజేశారు. మరో 32 ఎయిడెడ్‌ పాఠశాలలకు సంబంధించి 90 మంది నుంచి అంగీకార లేఖలు ఇప్పటివరకు అందలేదు.  తొలుత అంగీకార లేఖలు అందజేసిన వారందరినీ తాత్కాలిక సర్దుబాటు చేసిన అనంతరం వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ స్థానాలను కేటాయించనున్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఎయిడెడ్‌ టీచర్లు?"

Post a Comment