సీఎంకు సమర్పించిన నోట్‌లోని అంశాలు కేంద్ర సర్కారు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 32 శాతం

సీఎస్‌ కమిటీ చెప్తున్నట్లు 14.29 శాతం కాదు


పదకొండో పీఆర్సీ నివేదిక అమలు చేయండి


కుదరకపోతే తెలంగాణస్థాయిలో ప్రయోజనాలు


పీఆర్సీపై సీఎంకు ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ


కల్లా ప్రకటన రాకపోతే ఆందోళనే: నేతలు


కేంద్రసర్కారు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 32 శాతం


సీఎస్‌ కమిటీ చెప్తున్నట్లు 14.29 శాతం కాదు


పదకొండో పీఆర్సీ నివేదిక అమలు చేయండి


పీఆర్సీపై సీఎంకు ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ



అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సీఎస్‌ కమిటీ చెప్పినట్టు కేంద్రం తన ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేసిందనేది పూర్తి అవాస్తవమని ఉద్యోగ సంఘాల నేతలు గురువారం సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తన ఉద్యోగులకు 32 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందని పూర్తిస్థాయి లెక్కలతో సీఎంకు సమర్పించారు. అలాగే, హెచ్‌ఆర్‌ఏపై సీఎస్‌ కమిటీ చేసిన సిఫారసుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, ఉద్యోగులందరూ వేతనాలు కోల్పోతారని సీఎంతో జరిగిన సమావేశంలో వారు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు సీసీఏ ఎత్తేయడం దారుణమని, ప్రస్తుతం ఉద్యోగులకు సీసీఏ ఎంత ఆవశ్యకమో వివరిస్తూ సిద్ధం చేసిన నోట్‌ను సీఎంకి సమర్పించారు. అలాగే, రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించి అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ప్రయోజనం పొందే వయసును 70 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పెంచుతూ సీఎస్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు తమ వ్యతిరేకతను సీఎం వద్ద తెలిపారు.

సీఎంకు సమర్పించిన నోట్‌లోని అంశాలు:


11వ పీఆర్సీ కమిషన్‌ 27 శాతం ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసిందని సీఎస్‌ కమిటీ తన నివేదికలో చెప్పింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో పీఆర్సీ అమలులో 14.29 శాతమే ఫిట్‌మెంట్‌ ఇచ్చారని కూడా అదే నివేదికలో రాశారు. కాబట్టి రాష్ట్రంలో కూడా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఉండాలని చెప్పి సీఎస్‌ కమిటీ సిఫారసు చేసింది. అయితే, కేంద్రం 14.29 శాతమే ఫిట్‌మెంట్‌ ఇచ్చిందనడం తప్పు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్పటికే తీసుకుంటున్న వేతనాలపై 157 శాతం (డీఏ + ఫిట్‌మెంట్‌) పెంపును అమలు చేసి వచ్చిన మొత్తాన్ని కొత్త బేసిక్‌ పే గా ఫిక్స్‌ చేశారు. ఈ 157 శాతంలో 125 శాతం డీఏ, 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అయితే మిగిలిన 17.71 శాతం సంగతేంటి? దీన్ని బట్టి చూస్తే కేంద్రంలోని ఉద్యోగుల వేతనాలు ఏడో పీఆర్సీ అమల్లో 125 శాతం డీఏ, 32 శాతం ఫిట్‌మెంట్‌గా నిర్ధారించినట్టు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలోని సమాన కేడర్‌ ఉద్యోగుల వేతనాలను పరిశీలిస్తే కేంద్ర ఉద్యోగుల కంటే రాష్ట్ర ఉద్యోగుల వేతనాలు ఇప్పటికీ చాలాతక్కువగానే ఉన్నాయి. 11వ పీఆర్సీలో తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించిన వేతన స్కేళ్లను పరిశీలించినప్పుడు అక్కడ పీఆర్సీ కమిషన్‌ ఫిట్‌మెంట్‌ 7.5 శాతం అని చెప్పినప్పటికీ డీఏ + 15.75 శాతంతో వేతన స్కేళ్లను సవరించినట్టు అర్థమవుతోంది. 11వ పీఆర్సీ అమలు తేదీ 1.7.2018. ఆనాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్‌గా ప్రకటించి ఆ ప్రకారం, వేతనస్కేళ్లను సవరించింది. ఈ నేపథ్యంలో 11 పీఆర్సీ కమిషన్‌ నివేదికను అమలు చేయాలనేది ఉద్యోగుల డిమాండ్‌. కుదరని పక్షంలో కనీసం తెలంగాణ స్థాయిలోనైనా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబు కుదించారు..


పీఆర్సీ కమిషన్‌ హైదరాబాద్‌ నుంచి షిఫ్ట్‌ అయిన ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 30 శాతం సిఫారసు చేసింది. గరిష్ఠ పరిమితిని రూ.26,000గా నిర్ణయించింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 22ు హెచ్‌ఆర్‌ఏను బేసిక్‌ పే మీద సిఫారసు చేసింది. ఈ శ్లాబులో గరిష్ఠ పరిమితి 22,500 గా నిర్ణయించింది.  2నుంచి 10 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో 20ు హెచ్‌ఆర్‌ఏ సిఫారసు చేసింది. 20,000ను గరిష్ఠ పరిమితిగా నిర్ణయించింది. 50,000 నుంచి రెండు లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ 14.5 శాతం,  ఈ శ్లాబులో రూ.20,000ను గరిష్ఠ పరిమితిగా నిర్ణయించింది. మిగిలిన ఉద్యోగులకు 12 శాతం హెచ్‌ఆర్‌ఏ సిఫారసు చేస్తూ, గరిష్ఠ పరిమితిని రూ.17,000గా నిర్ణయించింది. అయితే, ఈ సిఫారసులను సీఎస్‌ కమిటీ పూర్తిగా విస్మరించి, కేవలం 3 శ్లాబులను సూచించింది. 5 లక్షల్లోపు జనాభా ఉండే ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏను 8 శాతంగా, 5 నుంచి 50 లక్షల వరకు జనాభా ఉండే ప్రాంతాల్లో 16 శాతం, 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులకు 24 శాతంగా సూచించింది. 

సీసీఏ ఎక్కడ...ఎంత..?


ఏపీలో 11వ పీఆర్సీ సూచించిన ప్రకారం విజయవాడ, విశాఖపట్టణంలో సీసీఏ నెలకు గరిష్ఠంగా రూ.1,000, మిగిలిన ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.750 ఇవ్వాల్సి ఉంది. కానీ, సీఎస్‌ కమిటీ సీసీఏ ప్రయోజనాలను ఏపీలోని ప్రభుత్వోద్యోగులకు పూర్తిగా ఎత్తేసింది. తెలంగాణ ప్రభుత్వం రూ.24,280 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో నెలకు 600, మిగిలిన ప్రాంతాల్లో రూ.300, రూ.24,280 నుంచి రూ.42,300 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో నెలకు రూ.850, మిగిలిన ప్రాంతాల్లో రూ.450, రూ.42,300 నుంచి రూ.54,220 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో రూ.950, మిగిలిన ప్రాంతాల్లో రూ.550, రూ.54,220 కంటే ఎక్కువ పే పొందుతున్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో రూ1250 మిగిలిన ప్రాంతాల్లో రూ.700 సీసీఏ ఇస్తోంది. కేంద్రం తన ఉద్యోగులకు సీసీఏ బదులుగా రవాణా అలవెన్సు ఇస్తోంది. నెలకు కనిష్ఠంగా రూ.900 + డీఏ, గరిష్ఠంగా 7,200 + డీఏ వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్‌ ప్రకారం సీసీఏ కొనసాగించాలి. లేదంటే కేంద్రం ఇస్తున్నట్టు రవాణా అలవెన్సు అయినా ఇవ్వాలి.

అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 


ప్రస్తుతం రాష్ట్రంలో అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను 70 సంవత్సరాల వయసు దాటిన వారికి ఇస్తున్నారు. వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆస్పత్రి ఖర్చులు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ఇది   ఇస్తున్నారు. కేంద్రంలో 80 ఏళ్లు దాటిన ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో కూడా 80 ఏళ్లు దాటిన ఉద్యోగులకే ఈ ప్రయోజనం అందజేద్దామంటూ సీఎస్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 15 శాతం, 75 నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 20 శాతం పెన్షన్‌ నష్టపోతారు. ప్రస్తుతం ఆ ప్రయోజనాలు పొందుతూ సీఎస్‌ కమిటీ సిఫారసు వల్ల నష్టపోయే పెన్షనర్లకు పర్సనల్‌ పెన్షన్‌ రూపంలో ప్రయోజనాలు కల్పించి నష్టం భర్తీ చేస్తామని అదే  కమిటీ తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో 70 నుంచి 75 ఏళ్లు ఉన్న వాళ్లకి 15 శాతం, 75 నుంచి 80 ఏళ్ల వయసు వారికి 20 శాతం అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో హెల్త్‌కార్డులు పనిచేయడం లేదు. కొవిడ్‌ సమయంలో ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు వైద్య ఖర్చుల రూపంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగులకు అయ్యే వైద్య ఖర్చులకు, ప్రభుత్వం విడుదల చేసే డబ్బులకు చాలా వ్యత్యాసం ఉంటోంది. కాబట్టి అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ప్రయోజనాలను సీఎస్‌ కమిటీ చెప్పినట్టుగా కాకుండా యథాతథంగా కొనసాగించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " సీఎంకు సమర్పించిన నోట్‌లోని అంశాలు కేంద్ర సర్కారు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 32 శాతం"

Post a Comment