పీఆర్‌సీ ఆందోళనలకు ఏఐటీయూసీ మద్దతు

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 6: పీఆర్‌సీ అమలు, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనలకు ఏఐటీయూసీ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నామని, అవసరమైతే ప్రత్యక్ష పోరాటాల్లోనూ పాల్గొంటామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు చెప్పారు. రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ రంగంలోనూ కనీసవేతనాలు అమలు చేయడంలేదని, అసలు కనీస వేతన సలహామండలి లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.24,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిధులు ప్రభుత్వం వాడుకుని తినేసిందని, ఈనిధులను వెంటనే సంక్షేమబోర్డుకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభలు గుంటూరులో ఈనెల 29, 30, 31 తేదీల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  ఈ మహాసభల్లో నిర్ణయాలు తీసుకుంటామన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పీఆర్‌సీ ఆందోళనలకు ఏఐటీయూసీ మద్దతు"

Post a Comment