పాఠశాలల విలీనం అభివృద్ధా?
అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): అసమానతలు తగ్గించాల్సిన విద్య.. కరోనా కాలంలో నూతన సామాజిక అసమానతలను పెంచిందని ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. యూటీఎఫ్, జేవీవీ, ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కరోనా-విద్యారంగ ప్రమాణాలు అనే అంశంపై రాష్ట్రస్థాయి విద్యాసదస్సు ఆదివారమిక్కడ నిర్వహించారు. ముఖ్య అతిథి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల స్నేహితుల్ని అందిస్తుందని, ప్రశ్నించే తత్త్వాన్ని అలవడేలా చేసి, అంతిమంగా విద్యార్థులకు సామాజీకరణ నేర్పుతుందన్నారు. ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. విశాలమైన పాఠశాల విద్యావ్యవస్థను 12వేల పాఠశాలలకు కుదించడం, ఎయిడెడ్ విద్యా వ్యవస్థను రద్దు చేయడం, ఉపాధ్యాయ పోస్టులను 1.86 లక్షల నుంచి 1.10 లక్షలకు తగ్గించే ప్రయత్నం చేయడం.. ఏవిధంగా విద్యాభివృద్ధి అవుతుందని ప్రశ్నించారు. మరో ఎమ్మెల్సీ కె.ఎ్‌స.ఎ్‌స.లక్ష్మణరావు మాట్లాడుతూ... పాఠశాల విద్యావ్యవస్థను విడదీయడం సరైన విధానం కాదని, ఇలా ఏ రాష్ట్రంలోనూ లేదని తెలిపారు.
0 Response to "పాఠశాలల విలీనం అభివృద్ధా?"
Post a Comment