అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి కాదు ఎన్‌ఈటీలో ఉత్తీర్ణత చాలు: కేంద్రo




న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పీహెచ్‌డీ తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్‌ తెలిపారు. జాతీయ అర్హత పరీక్ష (ఎన్‌ఈటీ)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నిర్ణయం ఈ ఒక్క ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో.. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులకు ఎన్‌ఈటీతో పాటు పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ, దేశంలోని యూనివర్సిటీల్లో 40 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండడం, ఆ స్థాయిలో అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో.. ఈ నిర్ణయంపై విద్యాశాఖ తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి కాదు ఎన్‌ఈటీలో ఉత్తీర్ణత చాలు: కేంద్రo"

Post a Comment