ధిక్కరణ కేసులో హైకోర్టు ముందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు






  • తమ ఆదేశాలు అమలుచేయలేదని న్యాయమూర్తి ఆగ్రహం
  • తదుపరి విచారణకూ రావాలని ఆదేశం

  • అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌, డైరెక్టర్‌ చినవీరభద్రుడు గురువారం హైకోర్టు ముందు హాజరయ్యారు. పిటిషనర్‌కు సంబంధించిన పాఠశాలల్లో ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేయాలని తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని వారిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వాదనలు వినిపించేందుకు సమయమివ్వాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోరారు. అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు విచారణను అక్టోబరు 22కి వాయిదావేశారు. ఆ రోజు కూడా ఈ ఇద్దరు అధికారులూ మళ్లీ కోర్టు ముందు హాజరుకావలసిందేనని ఆదేశించారు. ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో రాష్ట్రప్రభుత్వం జీవో జారీచేసిందని పేర్కొంటూ ప్రైవేటు రికగ్నైజ్డ్‌ ఎయిడెడ్‌ స్కూళ్ల యాజమాన్య సంఘం, మరికొందరు ఈ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు

    SUBSCRIBE TO OUR NEWSLETTER

    0 Response to "ధిక్కరణ కేసులో హైకోర్టు ముందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు"

    Post a Comment