సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు
అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. శనివారం విజయవాడలోని దాసరి భవన్‌లో కేవీవీ ప్రసాద్ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్... రెండున్నర సంవత్సరాలైనా పట్టించుకోకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. దీనిపై సెప్టెంబరు 1న ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సీపీఐ మద్దతు తెలుపుతుందన్నారు. జల వివాదాలపైౖ వాస్తవాలు వెల్లడించి, అంతా ఒకే వైఖరితో ఉండడానికి వీలుగా రాష్ట్రం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
0 Response to "సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు"
Post a Comment