ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), ఆగస్టు 7: జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్)-2021కు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మెంబరు సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. అక్టోబరు 31న జరిగే పరీక్షలకు ఈ నెల 11 నుంచి సెప్టెంబరు 13 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.. పూర్తి వివరాలకు ఏయూ
వెబ్‌సైట్ andhrauniversity.edu.in ఏపీసెట్ వెబ్‌సైట్ apset.net.in ను సందర్శించాలని ఆయన సూచించారు
0 Response to "ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల"
Post a Comment