11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
అమరావతి, విజయవాడ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): 11వ పీఆర్సీని వెంటనే పరిశీలించి 50 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన స్కేళ్లను ప్రభుత్వం ప్రకటించాలని ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, జి.ఆస్కారరావు డిమాండ్ చేశారు. సీపీఎ్‌సను వెంటనే రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం విజయవాడలోని ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించారు. పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ తమ సంఘం ప్రభుత్వంతో ఒక వైపు సయోధ్యను కలిగిఉంటూనే, మరోవైపు ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు, సమస్యల పట్ల ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తోందని తెలిపారు.
డీఎస్సీ ద్వారా ఎన్నికైన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని, వాటి పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని, బయోమెట్రిక్ హాజరును అన్ని శాఖల కార్యాలయాల్లో రద్దు చేయాలని డిమాండ్ చే శారు. కాగా, రాష్ట్ర అడ్మినిస్ర్టేటివ్ సర్వీసు అధికారుల వ్యవస్థ ఏర్పాటు కోసం తొలి మేధో మథన సదస్సును ఆదివారం విజయవాడలోని హోటల్ లెమన్ ట్రీ పార్క్‌లో నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. సమావేశానికి మాజీ ఐఏఎస్ అధికారులు, గ్రూప్-1 అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లాంలను కూడా ఆహ్వానించినట్టు వివరించారు.
0 Response to "11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి"
Post a Comment