అలాంటి జాతీయ జెండాలు వాడొద్దు: కేంద్ర ప్రభుత్వం
ముంబై: స్వత్రంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్లాస్టిక్‌తో తయారు చేసిన జాతీయ జెండాలను వాడవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విధానాలు అమలయ్యేలా చూడాలని సూచించారు. కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలనే వినియోగించాలని,
అలాగే ఆ జెండాలను వినియోగించిన తర్వాత ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని తెలిపారు. జాతీయ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన తరువాత, అక్కడ వినియోగించిన కాగితపు జాతీయ జెండాలను పూర్తి గౌరవంతో డిస్పోజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది

0 Response to "అలాంటి జాతీయ జెండాలు వాడొద్దు: కేంద్ర ప్రభుత్వం"
Post a Comment