ఈ నిబంధన పాటించకుంటే.. వచ్చే నెల నుంచి పీఎఫ్‌ జమ కాదు

న్యూఢిల్లీ, ఆగస్టు 8  : పారా హుషార్‌ !! ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ) వినియోగదారులంతా త్వరపడాలి. సెప్టెంబరు 1లోగా తమ పీఎఫ్‌ యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌)కు ఆధార్‌ కార్డును తప్పనిసరిగా లింక్‌ చేసుకోవాలి. లేదంటే.. ఆ ఖాతాలోకి సంబంధిత ఉద్యోగులు పనిచేసే కంపెనీలు పీఎఫ్‌ మొత్తాలను జమ చేసే అవకాశం ఉండదు. ఈమేరకు ‘కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ 2020’లోని 142వ సెక్షన్‌లో కేంద్ర కార్మిక శాఖ సవరణలు చేసింది. వాస్తవానికి పీఎఫ్‌ ఖాతాతో ఆధార్‌ను లింక్‌ చేసుకునేందుకు జూన్‌ 1ని చివరి తేదీగా తొలుత నిర్ణయించినప్పటికీ, తర్వాత దాన్ని సెప్టెంబరు 1కి వాయిదా వేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈ నిబంధన పాటించకుంటే.. వచ్చే నెల నుంచి పీఎఫ్‌ జమ కాదు"

Post a Comment