ఆర్జేయూకేటీల్లో 23నుంచి తరగతులు
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్జేయూకేటీ)ల్లో ఈ నెల 23 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రీ యూనివర్సిటీ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తొలుత వీటిని ప్రారంభించి తర్వాత దశలవారీగా అందరికీ ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. గత నెలరోజుల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చినవారు, ప్రస్తుతం జ్వర లక్షణాలున్నవారు మినహా.. విద్యార్థులంతా ఈ నెల 21, 22 తేదీల్లోనే తమ తమ క్యాంప్‌సలకు చేరుకోవాలని ఆర్జేయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు
0 Response to "ఆర్జేయూకేటీల్లో 23నుంచి తరగతులు"
Post a Comment