ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టము 1982ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టము 1982ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఏదయినా విద్యాసంస్ధకు ప్రభుత్వ గ్రాంటును నిలుపుదల చేయడం, తగ్గించడం, ఉపసంహరించుకోవచ్చని ఆర్డినెన్స్ ద్వారా వెల్లడించారు. అలాగే నిర్ణయం తీసుకునే ముందు ఆ సంస్ధ మేనేజరుకు ఒక అవకాశం ఇవ్వాలని విచారణను రెండు నెల్లో
పూర్తిచేయాలని ఆర్డినెన్స్ ద్వారా సూచించారు. విచారణ సమయంలో కూడా గ్రాంటును నిలుపుదల చేసే అధికారన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ గవర్నర్ పేరుతో ఏపీ న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి సునీత ఆర్డినెన్స్ జారీ చేశారు.
0 Response to "ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టము 1982ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ"
Post a Comment