రేపు క్రీడా ప్రతిభ అవార్డుల ప్రదానం

అమరావతి (ఆంధ్రజ్యోతి), భవానీపురం, ఆగస్టు 27:జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న రాష్ట్రంలో క్రీడా ప్రతిభ అవార్డులు ప్రదానం చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి భానుమూర్తి రాజు శుక్రవారం తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలల్లో జిల్లాకు 5 చొప్పున మొత్తం 65 స్కూళ్లను ఈ ‘స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌’ అవార్డులకు ఎంపిక చేసినట్టు వారు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నట్టు చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రేపు క్రీడా ప్రతిభ అవార్డుల ప్రదానం"

Post a Comment