నవంబరు 17-18 తేదీల్లో జాతీయ స్థాయి సైన్స్ సదస్సు స్వాతంత్య్ర సంగ్రామంలో శాస్త్రవేత్తల పాత్రపై చర్చ
దిల్లీ: స్వాతంత్య్ర సంగ్రామంలో శాస్త్రవేత్తలు పోషించిన కీలక పాత్రను సైన్స్ బోధకులు, విద్యార్థులకు తెలియపర్చడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. నవంబరు 17-18 తేదీల్లో సైన్స్ బోధకులతో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనుంది. దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీనికితోడు ఏడాది పాటు ప్రదర్శనలు, సమావేశాలు, పోటీలు, విజ్ఞాన యాత్రల రూపంలో సైన్స్ వేడుకలను నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఈ నెల 25, 26 తేదీల్లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన విజ్ఞాన్‌ప్రసార్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
0 Response to "నవంబరు 17-18 తేదీల్లో జాతీయ స్థాయి సైన్స్ సదస్సు స్వాతంత్య్ర సంగ్రామంలో శాస్త్రవేత్తల పాత్రపై చర్చ"
Post a Comment