వాట్సాప్‌లో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ, ఆగస్టు 8: కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారు వాట్సా్‌పలో ఒక్క మెసేజ్‌తో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు కొవిన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయినవారికే ఈ వెసులుబాటు ఉండేది. ‘మై గవర్నమెంట్ కరోనా హెల్ప్‌డెస్క్’ మొబైల్ నంబరు ద్వారా సర్టిఫికెట్ డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకోసం వ్యాక్సిన్ తీసుకున్నవారు +91 9013151515 నంబరును తమ సెల్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్‌లో ‘కొవిడ్ సర్టిఫికెట్’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి పంపితే.. సెకన్ల వ్యవధిలో వ్యాక్సినేషన్ పత్రం అందుతుంది.
0 Response to "వాట్సాప్‌లో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్"
Post a Comment