హైస్కూల్ ఉపాధ్యాయులకు పీజీ తప్పనిసరి
బెంగళూరు: హైస్కూల్ ఉపాధ్యాయుల నియామకానికి పోస్టు గ్రాడ్యుయేట్ తప్పనిసరి అర్హత అయిందని విద్యాశాఖ కమిషనర్ అన్బుకుమార్ ప్రకటించారు.
జాతీయ విద్యావిధానం మార్గదర్శకాలలో భాగంగా హైస్కూల్ ఉపాధ్యాయుల నియామకానికి మాస్టర్ డిగ్రీ అర్హత కానుందన్నారు. రాష్ట్రంలో 4,700కు పైగా ఎయిడెడ్ హైస్కూళ్లు ఉండగా 2015 నుంచి నియామకాలు జరగలేదు. కేంద్రప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడంతో రెగ్యులర్ పోస్టుకోసం ఎదురుచూస్తున్న వేలాదిమందికి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. ఎస్‌ఎస్ఎల్‌సీ ఫలితాలు సోమవారం ప్రకటిస్తామని కొత్త విద్యాశాఖమంత్రి బీసీ నాగేశ్ వెల్లడించారు. విద్యాశాఖ మంత్రిగా ప్రకటించిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3.30గంటలకు ఎస్‌ఎస్ఎల్‌సీ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. జూలై 19, 22 తేదీలలో పరీక్షలు జరిగాయి. 8.72లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు

0 Response to "హైస్కూల్ ఉపాధ్యాయులకు పీజీ తప్పనిసరి"
Post a Comment