బడుల్లో కరోనా నివారణ చర్యలు మంత్రి ఆదిమూలపు సురేష్
మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా మార్కాపురం లక్ష్మీచెన్నకేశవనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు.
పాఠశాలలు ప్రారంభించి 10 రోజులైందన్నారు. ప్రస్తుతం 74 శాతం నుంచి 85 శాతం మధ్యలో విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం ఉపాధ్యాయులకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కరోనా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను విడతల వారీగా ప్రారంభిస్తామని వివరించారు

0 Response to "బడుల్లో కరోనా నివారణ చర్యలు మంత్రి ఆదిమూలపు సురేష్"
Post a Comment