ఈహెచ్‌ఎస్‌ కింద చికిత్స చేయాల్సిందే

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు సీఈఓ హెచ్చరిక


అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ కింద రిజిస్టర్‌ అయిన కొన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో రోగులను ఈహెచ్‌ఎస్‌ కింద చేర్చుకోవడం లేదు. 




నేరుగా డబ్బులు చెల్లిస్తేనే చేర్చుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. నిర్దిష్టంగా ఏదేని నెట్‌వర్క్‌ ఆసుపత్రిపై ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవు. ఈహెచ్‌ఎస్‌ రోగుల నుంచి వసూలు చేసిన దానికంటే పది రెట్లు ఎక్కువ పెనాల్టీ వేస్తాం’’ అని ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లిఖార్జున్‌ హెచ్చరించారు. 



సోమవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. అనారోగ్యంతో వచ్చే ఉద్యోగులకు డబ్బులు చెల్లించి, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ పెట్టుకోమని సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తే పెనాల్టీలు వేయడమే కాకుండా అన్ని స్కీముల నుంచి మూడు నెలలపాటు తొలగిస్తామని స్పష్టం చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈహెచ్‌ఎస్‌ కింద చికిత్స చేయాల్సిందే"

Post a Comment