నియోజకవర్గాల వారీగా ఇసుక ధర: సీఎం జగన్
అమరావతి:
ఇసుక తవ్వకం, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావుండొద్దని సీఎం జగన్‌మోహన్
రెడ్డి అన్నారు.
నూతన ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని, ధర కూడా తక్కువగా
ఉండాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన నూతన ఇసుక విధానంపై
సమీక్ష నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని,
ఉన్నతాధికారులు పాల్గొన్నారు
వినియోగదారులకు
నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని సీఎం జగన్ అన్నారు. ఇసుక రీచ్‌ల సామర్థ్యం
పెంచితే పెద్ద కంపెనీలు వస్తాయన్నారు. ఎవరైనా వచ్చి చలానా కట్టి ఇసుక
తీసుకెళ్లేలా విధానం ఉండాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాలు,
ప్రాంతాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలన్నారు. అంతకంటే ఎక్కువ ధరకు
విక్రయిస్తే ఎస్‌ఈబీ పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. గుత్తేదారు
ప్రత్యామ్నాయ రవాణా వసతి కూడా కల్పించాలన్నారు.
నియోజకవర్గంలో నిర్ణయించిన
ధర కంటే ఎక్కువకు విక్రయించేందుకు వీల్లేదని చెప్పారు. ప్రభుత్వ
నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు రాయితీపై ఇసుక సరఫరా చేయాలన్నారు. రాయితీ
ఇసుకను ఎంతదూరం వరకు సరఫరా చేయొచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు
0 Response to "నియోజకవర్గాల వారీగా ఇసుక ధర: సీఎం జగన్ "
Post a Comment