టీచర్ల బదిలీలు వాయిదా

రేషనలైజేషన్‌ ప్రక్రియ కూడా 2 నాటి 'చైల్డ్‌ఇన్ఫో'

ఆధారంగా హేతుబద్ధీకరణ ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ

స్కూళ్లలో చేరిన విద్యార్థుల పేరెంట్స్‌ నుంచి డిక్లరేషన్‌

మార్గదర్శకాలు జారీచేసిన పాఠశాల విద్య డైరెక్టర్‌



అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో రేషనలైజేషన్‌, టీచర్ల బదిలీ ప్రక్రియ వాయిదా పడింది. రేషనలైజేషన్‌ విషయంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయించింది. గతంలో ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటి 'చైల్డ్‌ ఇన్ఫో' ఆధారంగా రేషనలైజేషన్‌ చేపట్టాలి


అయితే, మంగళవారం ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) రాష్ట్ర నాయకులతో జరిపిన చర్చల్లో చైల్డ్‌ ఇన్ఫోను అప్‌డేట్‌ చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 29 లేదా అక్టోబరు 31లలో ఏది ఎక్కువైతే దాన్ని పరిగణించాలని ఫ్యాప్టో కోరింది. చైల్డ్‌ ఇన్ఫోను అప్‌డేట్‌ చేసేందుకు ఈ నెల 31 వరకు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేరెంట్స్‌ డిక్లరేషన్‌ స్వీకరించే బాధ్యతను ఎంఈవోలకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఆయా అంశాలపై స్పందించిన పాఠశాల విద్య డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు రేషనలైజేషన్‌, టీచర్ల బదిలీలకు సంబంధించి తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలకు రివైజ్డ్‌ షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టీచర్ల బదిలీలు వాయిదా"

Post a Comment