గాలి ద్వారా 2 మీటర్ల దూరం కరోనా వ్యాప్తి
బీజింగ్, సెప్టెంబరు 3:
ప్రపంచంపై కరోనా వైరస్ దాడి మొదలై 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ దీని
వ్యాప్తికి సంబంధించిన కారణాలపై పరిశోధకులకు స్పష్టత రావడం లేదు. మొదట్లో
గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం లేదన్న పరిశోధకులు ఆ తర్వాత తమ అభిప్రాయం
మార్చుకున్నారు. తాజాగా ఇప్పుడు గాలి ద్వారా రెండు మీటర్ల దూరంలో ఉన్న
వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదముందని తేల్చారు
జామా (జేఏఎంఏ) ఇంటన్నేషనల్ మెడిసిన్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం..
కరోనా సోకిన వ్యక్తితో ప్రత్యక్షంగా ఎలాంటి కాంటాక్ట్ లేనప్పటికీ గాలి
ద్వారా వైరస్ రెండు మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే
ప్రమాదముంది. ఈ ఏడాది జనవరిలో చైనాలో ఓ లక్షణాలు కనిపించని కరోనా రోగి
ద్వారా 24 మందికి ఇదే విధంగా కరోనా సోకింది. అతడు బస్సులో ప్రయాణిస్తున్న
క్రమంలో.. అతడికి రెండు మీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా గాలి ద్వారా వైరస్
సోకింది. ఈ ఘటన వైరస్ తొలినాళ్లలో జరగడంతో.. అప్పటికి మాస్కు తప్పనిసరి
నిబంధన అక్కడ లేదు. ఇలా.. నేటికీ కరోనాపై ఒక్కో అధ్యయనంలో ఒక్కో కొత్త
విషయం బయటపడుతూనే వస్తోంది
0 Response to "గాలి ద్వారా 2 మీటర్ల దూరం కరోనా వ్యాప్తి"
Post a Comment