జవాహర్ లాల్ నెహ్రూ,
జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు.
పండిత్‌జీజీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు
జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు
భారతదేశపు మొదటి ప్రధానమంత్రి
పదవీ కాలము
ఆగష్టు 15 1947 – మే 27 1964రాష్ట్రపతిరాజేంద్ర ప్రసాద్ మరియూ సర్వేపల్లి రాధాకృష్ణన్ముందు(ఎవరూ లేరు)తరువాతగుల్జారీలాల్ నందా(ఆపధర్మం
భారతదేశపు మొదటి విదేశాంగ మంత్రి
పదవీ కాలము
ఆగష్టు 15 1947 – మే 27 1964ముందు(ఎవరూ లేరు)తరువాతగుల్జారీలాల్ నందా
పదవీ కాలము
అక్టోబర్ 8 1958 – నవంబర్ 17 1959ముందుటి. టి. కృష్ణమాచారితరువాతమొరార్జీ దేశాయ్
వ్యక్తిగత వివరాలు
జననం1889 నవంబరు 14
అలహాబాద్, ఉత్తరప్రదేశ్,
ఇండియామరణం1964 మే 27 (వయసు 74)
కొత్త ఢిల్లీ, భారతదేశంజీవిత భాగస్వామికమలా నెహ్రూ
సంతానముఇందిరా గాంధీ
వృత్తిబారిస్టరు
జననం, కుటుంబ నేపథ్యం
జవాహర్‌లాల్ నెహ్రూ బ్రిటీష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులోని అలహాబాదు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భాగం) నగరంలో 1889 నవంబరు 14న రాత్రి 11.30 గంటలకు కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టర్, తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు. తల్లి స్వరూపరాణి తుస్సు లాహోర్‌లో స్థిరపడ్డ కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినది. మోతీలాల్ మొదటి భార్య బిడ్డను ప్రసవిస్తూ, బిడ్డతో సహా చనిపోగా స్వరూపరాణిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవాహర్‌లాల్ తొలి సంతానం
జవాహర్‌లాల్ నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్‌కు చెందినవారైనా తరాల క్రితం రాజ్‌కౌల్ అన్న పూర్వీకుడు ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డాడు. నెహ్రూ వంశస్థులు ఢిల్లీలో మొఘల్ పాలకులఆదరాభిమానాలకు పాత్రులై ఉన్నతస్థితి, ఆర్థికాభివృద్ధి పొందారు. కౌల్ అన్న అసలు వంశం పేరుకు తోడు నెహ్రూ అన్న మరొక వంశనామం కూడా చేర్చి కౌల్-నెహ్రూగా పెట్టుకునేవారు. క్రమేపీ కౌల్ అన్నది పోయి నెహ్రూ స్థిరపడింది.మోతీలాల్ నెహ్రూ తండ్రి అతను జన్మించడానికి కొద్ది నెలల ముందే మరణించినా, అప్పటికే భారతీయ సంస్థానాల్లో ఉన్నతోద్యోగులైన అన్నలు అతన్ని చదివించారు. మోతీలాల్ నెహ్రూ న్యాయవాదిగా మంచి పేరు సంపాదించి, బాగా సంపద ఆర్జించాడు. జవాహర్‌లాల్ జన్మించడానికి మూడేళ్ళ ముందే మోతీలాల్ వృత్తి రీత్యా కుటుంబం కాన్పూర్ నుంచి అలహాబాద్ చేరుకుని స్థిరపడింది.
జవాహర్‌లాల్ నెహ్రూ పుట్టేసరికే కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండేది. తల్లి స్వరూపరాణి ప్రభావంతో ఇంట్లో భారతీయమైన సంప్రదాయాలు, పండుగలు పబ్బాలు జరిగేవి. స్త్రీల నుంచి జవాహర్‌లాల్ అప్పటి సాధారణమైన భారతీయులందరిలానే పురాణగాథలు, జానపద కథలు విన్నాడు. గంగాస్నానం, దైవదర్శనం వంటివి తల్లి జవాహర్‌తో చేయించేది. జవాహర్ జననం నాటికే పేరొందిన న్యాయవాది, తర్వాతి కాలంలో బ్రిటీష్ బారిస్టర్ అయిన మోతీలాల్ నెహ్రూ బ్రిటీష్ పెద్దమనిషి తరహాలో వ్యవహరించేవాడు. ఇంటిలో విలాసవంతమైన ఈతకొలను, టెన్నిస్ కోర్టు వంటివి ఉండేవి. ఇలా కొంత భారతీయం, మరికొంత ఆంగ్లేయమైన పద్ధతులు కలిగిన ఈ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం అప్పటి అలహాబాద్ హిందూ అగ్రవర్ణ జీవనంలో పూర్తిగా కలవలేదు. అలహాబాద్‌కి కొత్తవారు కావడం, కాశ్మీరీ పండిట్లకు సహజంగా కొంత ఆచార వ్యవహారాల్లో పట్టింపు తక్కువ కావడం వంటి కారణాలకు మోతీలాల్ 1899లో సముద్రయానం చేసివచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోకపోవడం తోడుకావడంతో వీరి కుటుంబాన్ని అలహాబాద్ బ్రాహ్మణులు వెలివేశారు. కాశ్మీరీ పండితుల్లో కూడా కాస్త చాందసంగా ఉండే కుటుంబాలకు నెహ్రూ కుటుంబం దూరంగానే ఉండేది. వెరసి ఈ కుటుంబం మతాచారాల విషయంలో పట్టింపు చూపేది కాదు
సుసంపన్నమైన కుటుంబంలో తల్లిదండ్రుల తొలి సంతానం కావడంతో జవాహర్‌లాల్ బాల్యం ముద్దుమురిపాల నడుమ, అతిగారాబంగా సాగింది.జవాహర్‌లాల్‌ను తండ్రి కొద్దినెలల పాటు స్థానిక కాన్వెంటుకు పంపి ఆ ప్రయత్నం విరమించి, ఇంట్లోనే ప్రైవేటుగా చదివించడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అతనికి మహాపండితుడైన గంగానాథ ఝా సంస్కృత విద్య, అనీ బిసెంట్ సూచించిన ఫెర్డినాండ్ టి. బ్రూక్స్ అనే దివ్యజ్ఞాన సమాజ యువకుడు ఆంగ్ల విద్య బోధించేవారు. తండ్రి ఆంగ్ల విద్యకే ప్రాధాన్యం ఇచ్చాడు, అందుకు అనుగుణంగానే జవాహర్‌కి సంస్కృత విద్య ఒంటబట్టలేదు. బ్రూక్స్ అతనికి విజ్ఞానశాస్త్రం పట్ల ప్రాథమిక అవగాహన, దివ్యజ్ఞాన సమాజ తాత్త్వికత పట్ల ఆసక్తి, ఆంగ్ల కవిత్వం, సాహిత్యం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పలు అంశాలను పరిచయం చేశాడు.దివ్యజ్ఞాన సమాజం పరిచయం నెహ్రూకు బౌద్ధ, హిందూ మతగ్రంథాల పట్ల ఆసక్తి కలిగించి అధ్యయనానికి పురిగొల్పింది. మూడు సంవత్సరాల పాటు బ్రూక్స్ నెహ్రూకు ట్యూటర్‌గా వ్యవహరించాడు. అతని గురించి తర్వాతికాలంలో నెహ్రూ మాట్లాడుతూ "దాదాపు మూడేళ్ళు (అతను) నాతో ఉన్నాడు. ఎన్నోవిధాల అతను నన్ను గొప్పగా ప్రభావితం చేశాడు" అన్నాడు.
పాఠశాల విద్యాభ్యాసం
మోతీలాల్ జవాహర్‌లాల్ ప్రైవేటు విద్యను ముగింపజేసి, 1905 మే నెలలో కుటుంబ సమేతంగా బ్రిటన్ వెళ్ళి ప్రతిష్ఠాత్మక హేరో పాఠశాలలో కుమారుడికి ప్రవేశం సంపాదించాడు. హేరోలో ప్రతిభా పాటవాలు చూపి పేరుతెచ్చుకున్నా, క్రమేపీ హేరో పాఠశాల జీవితం అతన్ని విసుగెత్తించింది హేరో పాఠశాల విద్యాకాలం మొత్తం మీద అధికారుల శిక్షణ కోర్ మాత్రం అతన్ని ఆకట్టుకుని, ఉత్సాహభరితంగా పాల్గొనేలా చేసింది. మరోవైపు 1905లో భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు అతనికి ఆసక్తి కలిగించడం ప్రారంభించాయి. 1905లో జరిగిన బెంగాల్ విభజన, అది బెంగాల్‌లోని జాతీయోద్యమాన్ని బలహీనపరిచే చర్యగా ఆందోళనలు పెరుగుతూండడం, ఆ ఆందోళనలు కాంగ్రెస్ పార్టీలో అతివాదులు, మితవాదుల విభజన సృష్టించడం వంటి పరిణామాలను జవాహర్‌లాల్ ఆసక్తిగా పరిశీలించసాగాడు. తండ్రికి ఉత్తరాలు రాసి ఎప్పటికప్పుడు వార్తాపత్రికలు తెప్పించుకుంటూ ఉండేవాడు. ఆ దశలో అతనికి అతివాదుల మీద సానుభూతి ఏర్పడింది.మరోవైపు షుషిమా వద్ద నౌకాయుద్ధంలో రష్యాపై జపాన్ ఘనవిజయం సాధించిందన్న వార్త అతనిని చాలా సంతోషపరిచింది. ఆసియా దేశాలు ఐరోపా వలసపాలనలో మగ్గుతూ ఉన్న ఆ దశలో తోటి ఆసియా దేశమైన జపాన్ ప్రదర్శించిన సైనిక పాటవం, శక్తి సామర్థ్యాలు అతనికి ఉత్సాహం కలిగించాయి.హేరో పాఠశాలలో అతని విద్యావిషయమైన ప్రతిభకు బహుమతిగా బ్రిటీష్ చరిత్రకారుడు జి. ఎం. ట్రావెల్యాన్ ఇటలీ జాతీయవాది, సైన్యాధ్యక్షుడు అయిన గారిబాల్డ్ గురించిన పుస్తకాలు లభించాయి.ఇవి జవాహర్‌లాల్‌ను ప్రభావితం చేశాయి. తన మనసులో భారతదేశ స్వేచ్ఛ కోసం అద్భుతమైన పోరాటాలు చేసినట్టు కొన్ని దృశ్యాలు తళుక్కుమనేవని, ఆ పుస్తకాలు చదివేప్పుడు ఆలోచనల్లో అతను వర్ణించే ఇటలీ, తన మాతృభూమి భారతదేశం గొప్పగా కలగలిసిపోయేవని జవాహర్‌లాల్ పేర్కొన్నాడు.
కేంబ్రిడ్జి విద్యాభ్యాసం
జవాహర్‌లాల్ 1907లో కేంబ్రిడ్జి ప్రవేశపరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడై, ఆ సంవత్సరం అక్టోబరు నెలలో ట్రినిటీ కళాశాలలో చేరాడు. ప్రవేశపరీక్షకు, ట్రినిటీ ప్రవేశానికి మధ్యలో వేసవి కాలంలో కొన్ని వారాల పాటు ఐర్లాండును సందర్శించాడు. స్వయంపాలన కోసం పోరాటం చేస్తున్న ఐర్లాండు అతని ఆసక్తిని చూరగొంది. క్రియాశీలంగా ఆందోళనలు చేస్తున్న ఐరిష్ అతివాద ఆందోళనలు అతినికి నచ్చాయి. ఈ దశలో అతను తండ్రికి రాసే ఉత్తరాల్లో జాతీయవాద ఉద్యమాలు, వాటిలో ప్రత్యేకించి అతివాదం పట్ల తనకు ఏర్పడుతున్న అభిమానాన్ని వెల్లడించేవాడు.కేంబ్రిడ్జిలో అతను రసాయనశాస్త్రం, భూవిజ్ఞాన శాస్త్రం, భౌతికశాస్త్రాలను అధ్యయనాంశాలుగా స్వీకరించి కొన్నాళ్ళకే భౌతికశాస్త్రాన్ని విడిచిపెట్టి వృక్షశాస్త్రం స్వీకరించాడు. కేంబ్రిడ్జిలో జవాహర్‌లాల్ అంతగా శ్రమించి చదవలేదు. యువకులకు ఉత్సాహభరితంగా ఉండే కేంబ్రిడ్జి వాతావరణం అతని నిరాసక్తతను మార్చలేకపోయింది. ఆ దశలో జవాహర్‌లాల్‌కి టెన్నిస్ ఆట, గుర్రపుస్వారీ, పందెపు పడవల జట్టులో ఆడడం వంటి వ్యాపకాలు ఉండేవి కానీ ఆ వ్యాపకాలు వేటిలోనూ పూర్తి అభినివేశం కానీ, మంచి ఉత్సాహం గానీ చూపించలేదు. ఫైనల్ ట్రైపోన్ పరీక్షలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడైనవారిలోనూ అతని పేరు కింది వరుసలోనే వచ్చింది.అలా 1910లో ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఈ దశలో అతను రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం చదువుకున్నాడు. జార్జి బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎం.కీన్స్, బెర్ట్రాండ్ రస్సెల్, లూయీస్ డిక్సన్, మెరెడిత్ టౌన్సెండ్ వంటి వారి రచనలు అతని రాజకీయ, ఆర్థిక చింతనపై ప్రభావం చూపాయి.
న్యాయవిద్యాభ్యాసం
కేంబ్రిడ్జిలో ఫైనల్ ట్రైపోన్ పరీక్షకు ముందే ఇన్నర్ టెంపుల్‌లో చేరాడు. ఇన్నర్ టెంపుల్ అన్నది న్యాయవిద్య అభ్యసించి బారిస్టర్ కావడానికి అవసరమైన నాలుగు ఇన్‌లలో ఒకటి. కనీసం న్యాయవిద్య తన కుమారుడి ఆసక్తిని చూరగొందని, ఇకపై ఉత్సాహంగా చదువుతాడని మోతీలాల్ నమ్మాడు. కానీ తన ఇష్టంతో ప్రమేయం లేకుండా సాగుతున్న తన జీవితం పట్ల ఆనాసక్తితో ఉన్న జవాహర్‌లాల్ న్యాయవిద్యాభ్యాసంలోనూ పెద్ద చురుకుదనం, ఉత్సాహం ప్రదర్శించలేదు.. ఇన్నర్ టెంపుల్‌లోని రెండేళ్ళ కాలంలో జవాహర్‌లాల్ ప్రాణానికి ప్రమాదమైన సాహసకార్యాలు చేశాడు, పాత మిత్రులను తిరిగి కలిశాడు, ఫాషన్లు అనుసరించాడు, అప్పులు చేశాడు. ఇలా లండన్ జీవితంలోని సందడి చవిచూశాడు. అంతేతప్ప విద్యాభ్యాసంలో మంచి పట్టుదల కనబరచలేదు. ఫలితంగా 1912లో స్కాలర్‌షిప్‌లు, బహుమానాలు వంటివి ఏమీ సాధించకుండా బార్ ఎట్ లా పరీక్షల్లో సాధారణంగా ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటికి ఇంగ్లాండులో ఏడేళ్ళ విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భారతదేశానికి తిరిగివచ్చాడు. భారతదేశం తిరిగివచ్చేనాటికి అతని మనస్సు, బుద్ధి ఒక వృత్తి కోసం కాక, భవిష్యత్తులో రాబోయే పిలుపును అందుకోవడానికి సంసిద్ధంగా తయారైంది.నెహ్రూ
CLICK HERE TO DOWNLOAD MORE INFORMATION
జీవితచరిత్రకారుడుడు సర్వేపల్లి గోపాల్ ప్రకారం జవాహర్‌లాల్ విద్యభ్యాసం ముగించుకుని భారతదేశానికి తిరిగివచ్చేనాటికి చక్కని శిక్షణ పొందిన మనస్సు, మంచి భావనాశక్తితో పాటుగా జీవితాంతం శాశ్వతంగా అంటిపెట్టుకున్నవి మరో రెండు తెచ్చుకున్నాడు: అవి బ్రిటన్ పట్ల ప్రేమాభిమానాలు, బ్రిటీష్ విలువలు
0 Response to "జవాహర్ లాల్ నెహ్రూ,"
Post a Comment