3రాజధానులకు శంకుస్థాపన 16న?



 3రాజధానులకు శంకుస్థాపన 16న?

ప్రధానిని ఆహ్వానించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎం
పీఎంవోకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ



మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈనెల 16న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గానీ పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు. మూడు రాజధానులతో పాటు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈ విషయమై ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటీవల లేఖ రాసినట్టు తెలిసింది. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్డీ సంజయ్‌ ఆర్‌.భవసర్‌కి కూడా పంపారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవలే పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇక మూడు రాజధానులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి. మూడు రాజధానులకు శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 16వ తేదీని మంచి ముహూర్తంగా నిర్ణయించాం. తర్వాత మళ్లీ 2నెలల పాటు ముహూర్తాలు లేవు. అందువల్ల వీలైనంత త్వరగా ప్రధానితో అపాయింట్‌మెంట్‌ ఖరారు చేస్తే, ముఖ్యమంత్రి ఆయనను స్వయంగా కలిసి రెండు ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించి, ఆహ్వానిస్తారు’’ అని శేషాద్రికి రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాష్‌ విజ్ఞప్తి చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "3రాజధానులకు శంకుస్థాపన 16న?"

Post a Comment