రూ. 2 వేల నోట్ల ముద్రణ పూర్తిగా నిలిపివేత : ఆర్‌టీఐలో వెల్లడి
ఆ తర్వాత... 2016-17 ఆర్ధిక సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18 లో
రూ. 11.15 కోట్లు, 2018-19 లో రూ. 4.66 కోట్ల విలువైన 2 వేల నోట్లను
ముద్రించిన ఆర్బీఐ... కిందటి సంవత్సరం మాత్రం ఎటువంటి ముద్రణా
కార్యకలాపాలనూ చేపట్టలేదు.
ఇదే సమయంలో రూ. 500 నోట్ల ముద్రణ మాత్రం గణనీయంగా పెరిగింది. 2016-17 లో ముద్రితమైన రూ. 429.22 కోట్ల విలువైన 500 నోట్లతో పోలిస్తే, గత సంవత్సరం దాదాపు రెట్టింపుగా... అంటే... రూ. 822.77 కోట్ల విలువైన ముద్రణ జరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. మొత్తంమీద ఈ నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్లు, రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించింది.
కాగా... 1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ గత నాలుగేళ్లుగా నిలిపివేసింది. ముద్రణ వ్యయం విషయానికొస్తే,,, రూ. 200 నోటుకు అత్యధికంగా ఒక్కో నోటుకు రూ. 2.15 చొప్పున వ్యయమవుతోందని, ఇక... రూ. 500 నోటుకు రూ. 2.13, రూ. 100 నోటుకు రూ. 1.34 చొప్పున ఖర్చవుతోందని వెల్లడించింది. రూ. 50 నోటుకు 82 పైసలు, రూ. 20 నోటుకు 85 పైసలు, రూ. 10 నోటుకు రూ. 75 పైసలు చొప్పున ఖర్చవుతోందని వెల్లడించింది
0 Response to "రూ. 2 వేల నోట్ల ముద్రణ పూర్తిగా నిలిపివేత : ఆర్‌టీఐలో వెల్లడి"
Post a Comment