పాఠశాల విద్య, ఇంటర్‌లో 25-30% పాఠ్యాంశాల తగ్గింపు

 పాఠశాల విద్య, ఇంటర్‌లో 25-30% పాఠ్యాంశాల తగ్గింపు

మంత్రి సురేష్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: పాఠశాల విద్య, ఇంటర్‌లో ఈ ఏడాది 25-30% పాఠ్యాంశాలను తగ్గించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. 




కొవిడ్‌-19 కారణంగా పాఠశాలలను, కళాశాలలను తెరవలేకపోవడంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శనివారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. బడులను జూన్‌ 12 నుంచి తెరిస్తే 222 పనిదినాలు వచ్చేవని, కరోనా వల్ల 61 పనిదినాలను కోల్పోయామని అన్నారు. మిగతా 160 రోజులకు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినకుండా పాఠ్యాంశాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం పూట అసెంబ్లీని తరగతి గదుల్లోనే జరపాలని సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాల విద్య, ఇంటర్‌లో 25-30% పాఠ్యాంశాల తగ్గింపు"

Post a Comment