కర్ఫ్యూ కేసుల్లో చిక్కితే ఉద్యోగం ఊడుతుంది!
చెన్నై : కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి కేసుల్లో చిక్కిన వారి ఉద్యోగం ఊడుతుందని ఐజీ అమల్‌రాజ్ హెచ్చరించారు. ‘
కరోనా’ వైరస్‌ను అడ్డుకొనేలా మే 3వ తేది వరకు కర్ఫ్యూ పొడిగించారు. సరైన కారణం లేకుండా తిరిగే వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులు నమోదుచేస్తున్నారు.
ఈ విషయమై కేంద్ర మండల ఐజీ అమల్‌రాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లం ఘించే వారిపై కేసులు నమోదుచేస్తున్నామని,
ఆ కేసులు ముగిసే వరకు సదరు ఉద్యోగులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారు అయితే కేసు విచారణ పూర్తయ్యే వరకు విధులను వెళ్లలేని పరిస్థితి ఉంటుందన్నారు.
అలాగే పాస్‌పోర్ట్ కూడా పొందలేరని, అత్యవసర పనులకు తప్ప ప్రజలు బయటకు రావద్దని ఆయన సూచించారు
0 Response to "కర్ఫ్యూ కేసుల్లో చిక్కితే ఉద్యోగం ఊడుతుంది!"
Post a Comment