లాక్‌డౌన్‌.. మరిన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రం

లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో సవరణలు

దిల్లీ: లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేసింది. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది. 




అటవీ ఉత్పత్తులు, కలప సేకరణను వ్యవసాయ కార్యకలాపాల్లో చేర్చింది. కొబ్బరి, వెదురు, కోకో, సుగంధ ద్రవ్యాల సాగు, శుద్ధి, ప్యాకేజింగ్‌కు అవకాశం కల్పిస్తూ సవరణలు చేసింది. ఈ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


లాక్‌డౌన్‌  పొడిగింపు తర్వాత అనేక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం మరిన్ని అంశాలు జోడించింది. తక్కువ సిబ్బందితో పనిచేసే నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు అవకాశం కల్పించింది.

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్‌, టెలిఫోన్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్ల పనులకు అనుమతులు ఇచ్చింది. ఈమేరకు అన్ని శాఖలు, విభాగాల అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించిన విషయం తెలిసిందే

Additional information
ఢిల్లీ : మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే పలు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో దశ లాక్‌డౌన్‌లో.. ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపు ప్రకటించింది. అయితే నిబంధనల సడలింపు వైరస్‌ హాట్‌ స్పాట్స్‌కు, కంటైన్మెంట్‌ జోన్స్‌కు వర్తించబోదని  కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌ కాలంలో మరిన్ని సడలింపులు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

కేంద్రం ప్రకటించిన సడలింపుల జాబితాలో ఉన్నవి..

అటవీ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్‌, మైనర్‌ టింబర్‌ డిపోలకు అనుమతి


కొబ్బరికాయలు, వెదురు, సుగంధ ద్రవ్యాల కోత, ప్రాసెసింగ్‌, అమ్మకాలు, మార్కెటింగ్‌కు అనుమతి


నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌, హాసింగ్‌ ఫైనాన్స్‌, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు, కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ కార్యకలాపాలకు అనుమతి


గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న నీటి సరఫరా, శాటిటేషన్‌, విద్యుత్‌ స్థంభాలు, టెలిఫోన్‌ కేబుల్స్‌ తదితర పనులకు అనుమతి



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "లాక్‌డౌన్‌.. మరిన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రం"

Post a Comment