లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు
హైదరాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో మొత్తం 22 అంశాలను ప్రభుత్వం పేర్కొంది. బ్యాంకులు, ఏటీఎంలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, టెలికాం,తపాలా, అంతర్జాల సేవలు, ఆస్పత్రులు, ఆప్టికల్ దుకాణాలు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ఫార్మా, తయారీ, రవాణాకు ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు
ఇచ్చింది. అలాగే నిత్యావసర వస్తువుల రవాణా, సప్లై చైన్, గ్రాసరీస్, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, వాటి రవాణా, రెస్టారెంట్లలో టేక్ అవే, హోం డెలివరీ, పెట్రోల్, బంకులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ ఏజన్సీస్, గ్యాస్ గోడౌన్లు, సంబంధిత రవాణ, ప్రైవేట్ సహా అన్ని సెక్యూరిటీ సేవలు, కరోనా నివారణకు ఉపయోగపడే ప్రైవేట్ సంస్థలు, విమానాశ్రయాలు, సంబంధిత సేవలను ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.
పూర్తిస్థాయిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, డివిజినల్, మండల కార్యాలయాలు, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖలు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు, అగ్నిమాపక శాఖ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా కార్యాలయాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పన్నుల కార్యాలయాలు, విద్యుత్, నీటిసరఫరా కార్యాలయాలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థశాఖ కార్యాలయాలు, మత్స్య, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు, కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు కొలతల శాఖ కార్యాలయాలు, ఔషధ నియంత్రణ సంస్థకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లభించింది
0 Response to "లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు"
Post a Comment