పది’ పరీక్షల నిర్వహణపై సీఎం వైఎస్ జగన్ క్లారిటీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పదో తరగతి పరీక్షలు యాథాతథంగా జరుగుతాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన జగన్ ఈ ప్రకటన చేశారు. మార్చి 31 నుంచి యథావిధిగా పరీక్షలు జరగనున్నాయి. 



ఇదిలా ఉంటే.. ఇదివరకే ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఏపీలోని అన్ని కళాశాలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించడం జరిగింది. కాగా.. జలుబు, దగ్గు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూంల్లో పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇదివరకే ప్రకటించారు. అయితే హాస్టల్‌ విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసి అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తాని మంత్రి స్పష్టం చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పది’ పరీక్షల నిర్వహణపై సీఎం వైఎస్ జగన్ క్లారిటీ"

Post a Comment