ఎన్‌పీఆర్‌, జన గణన వాయిదా!

 ఎన్‌పీఆర్‌, జన గణన వాయిదా!

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలోనే..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతున్న తరుణంలో జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), మొదటి విడత జన గణన వాయిదా పడే అవకాశముంది. దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాల సమాచారం. 


ఈ విషయమై ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. మరోవైపు పలు రాష్ట్రాలు ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసిన అంశాలనూ ప్రస్తావిస్తున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గేవరకు ఎన్‌పీఆర్‌, జన గణన మొదలు పెట్టకపోవచ్చని హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. జాతీయ జనాభా పట్టిక, జన గణన ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జరగాల్సి ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎన్‌పీఆర్‌, జన గణన వాయిదా!"

Post a Comment