అధిక ఫీజులపై కొరడా!

ప్రైవేట్‌ పాఠశాలల్లో తనిఖీలు

అనేక లోపాలు గుర్తింపు.. నేడు జూనియర్‌ కాలేజీల్లో


అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 130 ప్రైవేట్‌ పాఠశాలల్లో అధికారులు తనిఖీలు నిర్వహించా రు. ప్రతి జిల్లాలోనూ అధిక ఫీజులు వసూలు చేస్తోన్న 10 పాఠశాలల చొప్పున ఎంపిక చేసి గురువారం ఈ తనిఖీలు చేపట్టారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాల మేరకు మండల విద్యాధికారులు(ఎంఈవో) ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లాకు 20 మంది ఎంఈవోలు తనిఖీల్లో 



పాల్గొన్నారు. ఈ బృందాలు సొంత జిల్లాలో కాకుండా, పక్క జిల్లాలకు వెళ్లి తనిఖీలు చేపట్టాయి. పాఠశాలల్లో పలు లోపాలను గుర్తించాయి. ముఖ్యంగా మరుగుదొడ్లు, ఆట స్థలాలు,  కనీస వసతులు లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం, పలు చోట్ల అపార్ట్‌మెంట్లలో తరగతులు నిర్వహిస్తుండటం గుర్తించారు. అలాగే జీవో ఎంఎస్‌ నెంబర్‌ 1 ప్రకారం  సిలబస్‌ ఫాలో కావడం లేదని, ఫీజుల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని తేల్చారు. శుక్రవారం ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో తనిఖీలు చేపడతారు. ఒక్కో జిల్లాకు 10 కాలేజీల చొప్పున మొత్తం 130 జూనియర్‌ కాలేజీల్లో తనిఖీలు చేపట్టనున్నట్టు కమిషన్‌ వర్గాలు తెలిపాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అధిక ఫీజులపై కొరడా!"

Post a Comment