ఒకే ‘ఆన్‌లైన్’ పరీక్షతో... మూడేళ్ళు... నిరుద్యోగులకు వెసులుబటు


న్యూఢిల్లీ : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ వెసులుబాటు కల్పించింది. నాన్‌ గెజిటెడ్ ఉద్యోగాలను ఇక ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా  భర్తీ చేయనుంది. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో



కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేది. కేంద్రం తాజా నిర్ణయంతో నిరుద్యోగులకు ఇటు సమయం, అటే డబ్బు... రెండూ ఆదా అవుతాయి.


ఈ క్రమంలో... నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలన్నింటికీ కలిపి ఇకపై ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్ధేులేు ఈ పరీక్షలో సాధిం,ూే మార్కులను ఏ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగం భర్తీకి సంబంధించైనా... మూడేళ్ల పాటు పరిగణనలోకి తీసుకుంటారు.


ఇప్పటి వరకు నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలను ఎక్కువగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌(ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), ఐబీపీఎస్‌లు నిర్వహిస్తున్నవిషయం విదితమే. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను తీసుకువస్తున్న విషయం విదితమే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఒకే ‘ఆన్‌లైన్’ పరీక్షతో... మూడేళ్ళు... నిరుద్యోగులకు వెసులుబటు"

Post a Comment