కేవీల్లో 5,949 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : కేంద్రీయ విద్యాలయాల్లో
(కేవీ) 5,949
ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దశలవారీగా వీటిని భర్తీ
చేస్తున్నామని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంత్ వెల్లడించారు.
దేశంలో మొత్తం 1225 కేవీలు
ఉండగా, వీటికి మొత్తం 48,236 టీచింగ్ పోస్టులు
మంజూరు చేశామని, ఇందులో ఇంకా 5,949 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని
రాజ్యసభకు మంత్రి తెలియజేశారు
0 Response to "కేవీల్లో 5,949 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ"
Post a Comment