ఎక్కడి నుంచైనా ఓటు వేయొచ్చు



ఐఐటీ మద్రాస్‌-ఈసీ సంయుక్త

భాగస్వామ్యంతో పరిశోధనలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలో ఎక్కడి నుంచైనా ఓటువేసే వెసులుబాటును కల్పించే సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఐఐటీ మద్రాస్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈసీ పరిశోధనలు జరుపుతోంది. ఇందు కు అధునాతన ‘బ్లాక్‌ చైన్‌’ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సందీప్‌ సక్సేనా వెల్లడించారు. ‘ఒకవేళ ఈ పరిజ్ఞానం ఆచరణయోగ్యంగా ఉందని భావిస్తే.. ఓట ర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తాం. అనంతరం దాన్ని ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో చేర్చుతూ చట్టాల్లో మార్పులు చేస్తాం’ అని చెప్పారు. 





దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేయదలిచిన వారు.. ఎక్కడైతే ఓటు వేయాలని అనుకుంటున్నారో అక్కడి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆమేరకు విజ్ఞప్తితో దరఖాస్తు చేసుకోవాలి. ఆపై అధికారులు నిర్దేశించిన పోలింగ్‌ స్టేషన్‌కు నిర్ణీత సమయంలోగా వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఈ క్రమంలో తొలుతగా ‘టూ-వే బ్లాక్‌ చైన్‌ రిమోట్‌’ పద్ధతిలో ఓటరు వ్యక్తిగత సమాచారం వాస్తవికమైందేనా? కాదా? అనేది నిర్ధారిస్తారు. ఇందుకోసం అత్యంత సురక్షితమైన ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ నెట్‌వర్క్‌(ఈఆర్‌ఓ-నెట్‌)కు చెంది న బయోమెట్రిక్‌, వెబ్‌ కెమెరాలను వినియోగిసా ్తరు. ఓటరు సమాచారం నిజమని తేలగానే అతడి పేరిట ఒక ఈ-బ్యాలట్‌(స్మార్ట్‌ కాంట్రాక్ట్‌) పేపర్‌ జారీ అవుతుంది. దీని ఆధారంగా ఓటు నమోదు చేసుకోగానే.. ఆ బ్యాలట్‌ వివరాలు ప్రత్యేక కోడ్‌లో కి మారుతాయి. ఈ ప్రక్రియను ఎన్‌క్రిప్షన్‌ అంటా రు. ఇది జరిగిన వెంటనే ఒక బ్లాక్‌చైన్‌ హ్యాష్‌ట్యాగ్‌ జనరేట్‌ అయి, సదరు ఓటరుకు చెందిన వాస్తవిక పోలింగ్‌ స్టేషన్‌కు బదిలీ అవుతుంది. ఫలితంగా అక్కడి అభ్యర్థి/రాజకీయ పార్టీ ఖాతాలో ఓటు జమవుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎక్కడి నుంచైనా ఓటు వేయొచ్చు"

Post a Comment