ఏప్రిల్ నుంచి 'ప్రీపెయిడ్ విద్యుత్తు మీటరు' తప్పనిసరి
విల్లివాక్కం, న్యూస్‌టుడే: పంచాయతీ, పట్టణ పంచాయతీ, నగరపాలక, పురపాలక తదితర స్థానిక సంస్థలలో 2020 ఏప్రిల్ నుంచి ఛార్జీ చెల్లించిన మేరకు విద్యుత్తు వినియోగించేలా 'ప్రీపెయిడ్ మీటరు' తప్పనిసరి చేయాలని విద్యున్మండలి తీర్మానించింది. రాష్ట్రంలో విద్యుత్తు రీడింగ్ తీసిన 20 రోజుల్లోగా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తారు. స్థానిక సంస్థలలో వీధి దీపాలు, తాగునీటి సరఫరా తదితర ప్రజా సంక్షేమ పనులకు విద్యుత్తు వినియోగిస్తున్నారు. ఈ సంస్థలకు మాత్రం విద్యుత్తు బిల్లు చెల్లించడానికి 60 రోజులు అవకాశం ఇస్తున్నారు. కానీ, నెలల తరబడి బిల్లు చెల్లించడం లేదు. సకాలంలో వసూలు చేయడానికి 'ప్రీపెయిడ్ మీటర్లు' పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర విద్యున్మండళ్లకు ఉత్తర్వులు జారీ
మీటర్లో ఉన్న మొత్తానికి సరిపడా మాత్రమే విద్యుత్తు సరఫరా చేసేలా సాఫ్ట్‌వేర్ రూపొందించనున్నారు. ఆ మొత్తం దాటితే విద్యుత్తు సరఫరా నిలిచిపోతుంది చెన్నై సమీపంలోని మరైమలైనగర్ మున్సిపాలిటీ, గూడువాంజేరి పట్టణ పంచాయతీ కార్యాలయాలలో ప్రయోగాత్మకంగా ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఇప్పటికే విద్యున్మండలి పొందుపరిచింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇతర స్థానిక సంస్థల్లోనూ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని తాజాగా నిర్ణయించింది
0 Response to "ఏప్రిల్ నుంచి 'ప్రీపెయిడ్ విద్యుత్తు మీటరు' తప్పనిసరి"
Post a Comment