పెన్షన్ వారోత్సవాలు ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్-ధన్ (పిఎంఎస్‌వైఎం), వ్యాపారులు, స్వయం ఉపాధి దారుల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని విస్తరించేందుకు శనివారం నుండి పెన్షన్ వారోత్సవాన్ని జరుపుతామని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్చి 2020 నాటికి పిఎంఎస్‌వైఎం కోసం కోటిమంది లబ్ధిదారులను, ఎన్‌పిఎస్ పథకం కింద 50 లక్షల మంది లబ్ధిదారు లను
చేర్చనున్నామని అది ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రారంభించారు. ఈ పథకం కింద నమోదు చేసుకునేందుకు ఆధార్, సేవింగ్స్ బ్యాంక్/ జనధన్ ఖాతాలు మాత్రమే అవసర మని, దీంతో పింఛను పథకాలు రెండింటిలో సులభంగా నమోదు చేసుకోవచ్చని గంగ్వార్ అన్నారు
100 చొప్పున జమ చేస్తే ఏడాదికి ఆ మొత్తం రూ.1200 అవుతుందని, 60 ఏళ్లు వచ్చేసరికి రూ.36వేలు అవుతుంది. 60 ఏళ్లు దాటిన అనంతరం ఆ వ్యక్తి ఏడాదికి రూ. 36వేలు చొప్పున పెన్షన్ కింద పొందుతాడు. ఆ వ్యక్తి మరణించిన అనంతరం జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ లభిస్తుంది.
అంటే నెలకు రూ.1500 పొందుతారు. భార్యాభర్తలిద్దరూ అర్హులైతే ఈ పథకంలో విడివిడిగా చేరవచ్చని, 60 ఏళ్ల అనంతరం రూ. 6 వేలు పెన్షన్ పొందుతారని తెలిపారు
0 Response to "పెన్షన్ వారోత్సవాలు ప్రారంభం"
Post a Comment