మరింత తగ్గిన ఎస్‌బీఐ వడ్డి రేట్లు
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలు,
డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. అదనపు నిధుల
సమీకరణ వ్యయాల ఆధారంగా నిర్ణయించే ఎంసీఎల్‌ఆర్ వడ్డీ
రేటు వర్తించే అన్ని కాలపరిమితి రుణాలపై వడ్తీ రేటును 8.05
శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. ఈ నెల 10 నుంచే ఈ
తగ్గింపు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎస్‌బీఐ తన రుణాలపై ఎంసిఎల్‌ఆర్
ఆధారిత వడ్డీ రేటు తగ్గించడం ఇది ఏడోసారి. అక్షోబరులోనూ ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ రుణా
లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం)
తగ్గించింది. ఈ నెల 10 నుంచి టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటునూ 115 నుంచి 5 బేసిస్
పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది
0 Response to "మరింత తగ్గిన ఎస్‌బీఐ వడ్డి రేట్లు"
Post a Comment