ఇంగ్లిష్‌ రాకుండా* *ఉద్యోగాలొస్తాయా

*📚✍ఇంగ్లిష్‌ రాకుండా*
 *ఉద్యోగాలొస్తాయా?✍📚*

*♦పిల్లల తలరాతలు మార్చడానికే ఆంగ్ల మాధ్యమం*

*♦ఎన్ని విమర్శలొచ్చినా దీనిపై వెనక్కి తగ్గేది లేదు*

*♦కళాశాల విద్యార్థులకు ఏడాదికి రూ.20వేల మెస్‌ ఛార్జీలు*

*♦ఒంగోలులో ‘మనబడి నాడు-నేడు’ ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌*

*⭕ఒంగోలు నుంచి ఈనాడు ప్రతినిధి*

*🔺‘నా సహచరుడు విద్యాశాఖ మంత్రి సురేశ్‌, నా సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ రాజశేఖర్‌... వీరంతా తెలుగు చదివి, తర్వాత పోటీప్రపంచంలో రాణించలేమని ఇంగ్లిష్‌ చదివి ఆయా ఉద్యోగాలు అధిరోహించారు’*
*నావల్ల తెలుగుజాతి ఇబ్బంది పడుతుందని అవాకులు, చవాకులు పేలుతున్న నాయకులను అడుగుతున్నా. మీ పిల్లలే ఇంగ్లిష్‌ చదువులు చదవాలా? పేదపిల్లలు చదవకూడదా?*

*💥- ముఖ్యమంత్రి జగన్‌*

🌻‘చదువుతోనే పేదరికాన్ని జయించగలం. దొంగలు ఎత్తుకెళ్లలేని సొత్తు అది. అందుకే ప్రతి పేదోడి ఇంట్లో ఒక డాక్టరో, ఇంజినీరో, కలెక్టరో, నిపుణుడో రావాలని, అప్పుడే వారి జీవితాలు బాగుపడతాయని విశ్వసించి సర్కారు బడుల్లో ప్రాథమిక విద్యలో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని సంకల్పించాం. కార్పొరేట్‌కు దీటుగా, నాణ్యమైన విద్యాబోధనకు వీలుగా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ‘నాడు-నేడు’  ప్రారంభిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్యలోనే కాక కళాశాల విద్యలోనూ పలు కార్యక్రమాలకు నాంది పలకబోతున్నామని చెప్పారు. పదేళ్ల తర్వాతి పోటీ ప్రపంచంలో తెలుగు విద్యార్థులు పోటీని తట్టుకుని నిలవాలంటే, వారికి ఇప్పటినుంచే ఆంగ్లమాధ్యమంలో ప్రావీణ్యం ఉండాలన్నారు.
ప్రతి తల్లినీ, తండ్రినీ కోరుతున్నా..
ఇంగ్లిష్‌ చదువులు లేకుండా ఉద్యోగాలు పొందడం సాధ్యమా.. అని తల్లిదండ్రులు   ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. ల్యాండ్‌ఫోన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్లు, రోబోటిక్స్‌ అద్భుతాలు, డ్రైవర్‌లెస్‌ కార్లతో సాంకేతిక రంగం కొత్తపుంతలు తొక్కుతోందని, ఇంకా మనం తెలుగులోనే చదవాలనుకుంటే మన పిల్లల తలరాతలు మారవని అన్నారు. వారు ఏ నైపుణ్యాలూ లేక రోజుకూలీలుగా మారిపోతారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ఇవన్నీ ఆలోచించే ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ విషయంలో తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని, అయినా వెనక్కు తగ్గేదిలేదని సీఎం స్పష్టంచేశారు.

*♦అలాగే వదిలేయాలా?*
శిథిలావస్థలో ఉన్న తెలుగు బడుల్లో పిల్లలు చేరడం లేదని వదిలేసి కార్పొరేట్‌కు కొమ్ముకాయాలా? అంటూ విపక్ష నాయకులను సీఎం జగన్‌ ప్రశ్నించారు. బడులు, వాటిలో ఉండే పిల్లల బాగు, వారి జీవితాల గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అందుకు భిన్నమన్నారు. పేదవర్గాల జీవితాలు, వారి పిల్లల తలరాతలు మార్చడానికే రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతున్నామని స్పష్టంచేశారు. ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టే క్రమంలో అనేక సవాళ్లు ఉంటాయని, వాటన్నింటినీ అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణతో పాటు పిల్లలకు బ్రిడ్జికోర్సులు పెట్టి వారిని తీర్చిదిద్దుతామన్నారు. తెలుగును తప్పనిసరిగా ఒక పాఠ్యాంశంగా ఉంచి.. విద్యాబోధన చేస్తామని పునరుద్ఘాటించారు. పోటీప్రపంచానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పు తీసుకురాకూడదా? ఈ విషయంలో విమర్శలు చేసే రాజకీయ నాయకులే ఒకసారి ఆలోచించాలని సూచించారు.
తొలివిడతలో 15,750 పాఠశాలల్లో
గత ప్రభుత్వం పాఠశాలల మరమ్మతుల కోసం రూ.20 కోట్లు వెచ్చించిందని, అవి ఏ మూలకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. శిథిలావస్థలో ఉన్న బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దటానికి రాష్ట్రంలో తొలివిడతగా 15,750 పాఠశాలల్లో పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు. వీటిల్లో జూన్‌, జూలై నాటికి పనులు పూర్తి చేసి నాడు-నేడు పేరుతో ఫొటోలు బడిముందు ఉంచుతామని, ఎలా అభివృద్ధి చేశామో చూపిస్తామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా నాడు-నేడుకు మూడేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నారు? ఇది ఎలా సాధ్యమని ఓ విద్యార్థిని ప్రశ్నించిందని... మీ అందరి దీవెనలు, దాతల సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని అన్నారు.

*♦జనరంజక పాలనని అంగీకరించారు: బాలినేని*
రాష్ట్ర అటవీ, పర్యావరణం, విద్యుత్తుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్‌ జనరంజక పాలన చేస్తే, తాను సినిమాలు తీసుకుంటానని పవన్‌ గతంలో చెప్పారని, ప్రస్తుతం ఆయన సినిమాలు తీసుకుంటున్నారంటే జగన్‌ది జనరంజక పాలన అని అంగీకరించినట్లే కదా అని వ్యాఖ్యానించారు. విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ కేంద్రం ప్రతి ఒక్కరికీ విద్య అని చట్టం తెచ్చిందని, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి రైట్‌ టూ ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపె విశ్వరూప్‌, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగం సురేష్‌తోపాటు జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

*👉ముఖ్యమంత్రి హామీలివీ..👇*
* వసతిగృహాల్లో ఉండే కళాశాల విద్యార్థులకు ఏడాదికి మెస్‌ఛార్జీల కింద రూ.20 వేల సాయం

* డిగ్రీలో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ

* ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు

* రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విశ్వవిద్యాలయం

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంగ్లిష్‌ రాకుండా* *ఉద్యోగాలొస్తాయా"

Post a Comment