హ్యాపీ బర్త్‌డే 'గూగుల్‌'

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్.. నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలో దేని గురించి తెలుసుకోవాలన్నా.. గూగుల్‌ చేస్తే చాలు క్షణాల్లో ఆ సమాచారమంతా మనముందుంటుంది. ఆ సెర్చ్‌ఇంజిన్‌ నేడు 21వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను తయారుచేసింది. 



పాతకాలం నాటి బాక్స్‌ కంప్యూటర్‌ మానిటర్‌పై గూగుల్‌ సెర్చ్‌ పేజీని చూపిస్తూ ఈ డూడుల్‌ను తయారుచేసింది. దానిపై 27 సెప్టెంబరు 1998 తేదీని చూపించే టైంస్టాంప్‌ కూడా ఉంది. సరిగ్గా 21ఏళ్ల క్రితం గూగుల్‌ డూడుల్‌ ఎలా ఉందో ఈ డూడుల్‌లో చూపించారు. 
1998 సెప్టెంబరులో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ కలిసి ఈ సెర్చ్‌ ఇంజిన్‌ను రూపొందించారు

googol అనే అర్థం వచ్చేలా ఈ సెర్చ్‌ ఇంజిన్‌కు google అని పేరు పెట్టారు. googol అంటే చాలా పెద్ద సంఖ్య. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్యను googol అంటారు. అంటే విస్తృతమైన సమచారం ఈ సెర్చ్‌ఇంజిన్‌లో దొరుకుతుంది అని చెప్పేందుకు ఆ పేరు పెట్టారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "హ్యాపీ బర్త్‌డే 'గూగుల్‌'"

Post a Comment