విద్యాశాఖ...ఇక పేపర్ లెస్
*🔊🗂విద్యాశాఖ...ఇక పేపర్ లెస్*
*🌎ఆన్లైన్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు*
*🌎ఉపాధ్యాయుల సెలవులకు అనుమతి అక్కడే*
*🌎ప్రైవేటుస్కూల్ అనుమతులు కూడా..*
*📕ఆన్ లైన్లో ఉపాధ్యాయుల పూర్తి సర్వీస్ వివరాలు*
```★పాఠశాల విద్యాశాఖలో ఇకపైకాగితం వాడకంలేకుండా పూర్తిగాఆన్లైన్లోనే అన్నిసేవలను
కొనసాగించనున్నారు. పరిపాలన అనుమతుల నుంచి
ఉపాధ్యాయుల సెలవుల వరకు అన్ని ఇకపై ఆన్లైన్లోనే చేప
ట్టనున్నారు. ప్రైవేటు పాఠశాలల అనుమతులకుసంబంధించి
కూడా ఆన్లైన్లోనే చేపడతారు. గత ఏడాది జరిగిన ఉపా
ధ్యాయుల బదలీలను ఆన్లైన్లో చేపట్టిన విద్యా శాఖ.. ఇకపై
అన్ని సేవలు అదేవిధంగా చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికేఅధికారులు చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నపాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను సేకరిం
చారు. వాటిని వెబీసైట్లో పొందుపర్చడం కూడా ప్రారంభిం
చారు. విద్యార్ధులకు సంబంధించి వివరాల నుయుడైస్ ద్వారా
సేకరించి వాటిని ఆన్లైన్లో పెట్టనున్నారు. ఉపాధ్యాయులకు
సంబంధించిన సర్వీస్ వివరాలను కూడా అప్లోడ్ చేయను
న్నారు. రాష్ట్రంలో ఉన్న లోకల్ బాడీ, ప్రభుత్వస్కూల్స్, వివిధ
సంక్షేమ శాఖల ద్వారా కొనసాగు తున్న గురు కులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్తోపాటు ప్రైవేట్ పాఠశాలలకు పూర్తి వివరాలను ఇకపైఆన్లైన్లోపొందుపర్చనున్నారు.
ఆన్లైన్లుఅమలు చేయడంతో
గుర్తింపులేనిగుర్తింపు లేకుండా 10వతరగ పాఠశాలలకు
తీని కొనసాగించే పాఠశాలలకు
చెక్..చెక్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు 10వ
తరగతి వరకు గుర్తింపు లేకున్నప్పటికీ కొనసాగుత
ఎన్నాయి. వాటిలో 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపులకు
సంబంధించిగుర్తింపు ఉన్న పాఠశాల నుంచి చేసేవారు. ఆన్లైన్
పై అవినీతికి పాల్పడే ఆస్కారం లేకుండా పోతుంది. ప్రతీ స్కూల్
విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి కొత్తగా 10వ
తరగతిలో ఫీజు చెల్లించడానికి వస్తే వారి వివరాలు ఏ
స్కూల్లోనూ ఉండవు. దీంతో వారు గుర్తింపులేని స్కూల్ నుంచి ఫీజు చెల్లిస్తున్నారని తెలిసిపోనుంది.```
*🌎స్కూల్స్ వివరాలుఆన్ లైన్లో...*
```★రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 42,421స్కూళ్లలో 60,01,680 విద్యార్థులు చదువుకుంటున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లో 2,63,469 మంది ఉపా
ధ్యాయులు పనిచేస్తున్నా రు. 11,689 మంది ప్రైవేటు
స్కూల్స్లో, 1,16,564 మంది ప్రభుత్వ పాఠశాలల్లో పని
చేస్తున్నారు. స్కూల్ ఎన్ని ఎకరాల్లో ఉంది. సౌకర్యా లేమిటి..?అన్నిగ్రౌండ్.. లైబ్రరీ.. ల్యాబ్తో పాటు ఇతర వివరాలు కూడాఅందులోఉండనున్నాయి.```
*🌎ఆన్లైన్లోనే ఉపాధ్యాయుల సెలవులు .*
```★ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయుల అన్ని రకాల సెలవులకు
సంబంధించి అనుమతులు కూడా ఆన్లైన్లోనే చేపట్టనున్నా
రు. ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి సెలవులకు అనుమతులు
కోరుతూ ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
వారికి ఎన్ని రోజులు సెలవులు కావాలి.. ఎప్పటి నుంచి కావా
లో తెలుపుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత
అధికారి అనుమతులు జారీ చేస్తారు. ఉపాధ్యాయుడి ఫోన్
నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా చేరుతుంది. ప్రైవేటు పాఠశాల
లకు సంబంధించిన అనుమతులు కూడా ఆన్లైన్లోనే చేపట్టనున్నారు. బదలీ సర్టిఫికెట్లు (టీసీ)కూడా ఆన్లైన్లోనేఇవ్వనున్నారు. సాంకేతిక కారణాలతో అమలు చేయ
లకపో తున్నారు. కానీ వచ్చే విద్యా సంవత్స
రం ప్రారంభం పక్కాగా అమలు
రీలో ఉన్న చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.```
*🍥ప్రైవేటు స్కూల్ టీచర్లకు ఉపయోగం..*
```★రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు స్కూల్స్లో పనిచేస్తున్న
ఉపాధ్యాయులకు ఆన్లైన్ విధానం అమలు చేస్తే చాలా
ఉపయోగంజరగనుంది. వారికి సర్వీస్ అనుభవానికి ఉపయో
గపడనుంది. ఆన్ లైన్లో పొందుపర్చినట్టయితే వారికి
వేతనాలు రెగ్యులర్ గా వేసేలా చర్యలు తీసుకోబడ తాయి.
అలాగేవారికి ఈఎస్ఐ, పీఎఫ్లసౌకర్యం కూడా కల్పించాల్సిన
పరిస్థితులు ఏర్పడతాయి. ఇవే కాకుండా వారికి సర్వీస్
ఎక్సపీరియన్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.```
*🍥ఇకపై ప్రైవేటుపాఠశాలల్లోపనిచేసే వారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల్లో ఓటింగ్ కోసం యాజమాన్యాల నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పొందే అవకాశం కూడా ఉంటుంది.*
0 Response to "విద్యాశాఖ...ఇక పేపర్ లెస్"
Post a Comment