మూతపడ్డ పాఠశాలలను ప్రారంభిస్తాం : edn.minister సురేష్

మోడల్ పాఠశాలల పేరుతో గత ప్రభుత్వం మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విద్య వ్యాపారం లాగా చూడకుండా ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సేవా దృక్పధంతో విద్యనందించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మొదటి రివ్యూ మీటింగ్ లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 10 పాఠశాలలు తిరిగి ప్రారంభించామన్నారు. ఒకే యాజమాన్యం పలు ప్రయివేట్ పాఠశాలలు నడుపుతున్నారన్నారు. గతంలో ప్రయివేట్ పాఠశాలలపై పర్యవేక్షణ లేకుండా వదిలేయడంతో ఇష్టారాజ్యంగా మారాయన్నారు



ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజుల కట్టడి జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. అమ్మ ఒడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. అమ్మ ఒడి ద్వారా రాష్ట్రంలో 7 లక్షల మందికి పైగా లబ్ది చేకూరుతుందని మంత్రి సురేష్ తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "మూతపడ్డ పాఠశాలలను ప్రారంభిస్తాం : edn.minister సురేష్"

Post a Comment