యోగా యాప్‌లివే... Today yoga day

యోగాను దినచర్యలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. అందుకు ఉపయోగపడే యాప్‌లు, మహిళలకు అవసరమయ్యే ఆసనాలు ఏంటో... అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందామా




యోగా గో యాప్‌


 యాప్‌లో ఫిట్‌నెస్‌తోపాటు అధిక బరువును నియంత్రించుకోవడానికి ఆహార నియమాలూ ఉంటాయి. ఏడు నుంచి 30 నిమిషాలపాటు మాత్రమే యోగా చేసేలా ఇందులో ప్రణాళిక ఉంటుంది. ఒక సెషన్‌కు 200 కెలొరీలు ఖర్చవుతాయి.


పాకెట్‌ యాప్‌

 యాప్‌ మీ ఫోనులో ఉంటే, యోగా శిక్షకుడు మీకు అందుబాటులో ఉన్నట్లే. యోగాసనాలు వేయడంలో ఎన్నో సూచనలు చేస్తుందీ యాప్‌. ఏ భంగిమ ఎలా వేయాలో, దానివల్ల కలిగే లాభాలేంటో చెబుతుంది




బ్రీత్‌ యాప్‌

యోగాను ప్రారంభించాలనుకునే వారికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకుని వదలడం, ఎంతసేపు శ్వాస తీసుకోవాలీ... వంటి సమాచారం ఇందులో ఉంటుంది. ఈ యాప్‌లోని యానిమేషన్‌ బొమ్మలు అవసరమైన సూచనలు చేస్తాయి. ఇందులో ఉండే అలారం రోజూ నిర్ణీత సమయానికి యోగా చేయాలంటూ గుర్తు చేస్తుంది



సింప్లీ యాప్‌

ఐఓఎస్‌, యాండ్రాయిడ్‌ ఫోన్లలో పనిచేసే ఈ యాప్‌లో 20, 40, 60 నిమిషాల పాటు చేయవలసిన వర్క్‌అవుట్లు, 30 రకాల యోగాసనాలు ఆడియో, వీడియో రూపంలో ఉంటాయి. ఆరు భాషల్లో ఉండే ఈ సమాచారం ఎవరికైనా ఉపయోగపకరమే. కెలొరీలు కరిగించడానికి, శక్తి పుంజుకోవడానికి, శరీరాన్ని సమతుల్యం చేసి ఏకాగ్రతగా ఉంచడానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి



డైలీ యాప్‌

ఇందులో దాదాపు 500 ఆసనాలుంటాయి. 200కు పైగా గైడెడ్‌ క్లాసెస్‌, మెడిటేషన్‌, 50కి పైగా వర్క్‌అవుట్‌ ప్రణాళికలుంటాయి. ప్రముఖ యోగా శిక్షకుల సలహాలు, వర్క్‌షాప్‌లూ ఈ యాప్‌లో చూడొచ్చు


5 మినిట్‌.

ఈ యాప్‌లో అయిదునిమిషాల్లో చేసే యోగాసనాల గురించి సమాచారం ఉంటుంది. ఈ ఆసనాలన్నీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "యోగా యాప్‌లివే... Today yoga day"

Post a Comment